News March 2, 2025

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం.. క్లారిటీ ఇదే

image

మెగాస్టార్ చిరంజీవి బ్రిటన్ సిటిజన్ షిప్ అందుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై మెగా టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది. ఇలాంటి వార్తలు ప్రచురించే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా చిరంజీవికి యూకే గవర్నమెంట్ తమ పౌరసత్వం ఇచ్చి గౌరవించిందంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Similar News

News November 13, 2025

నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <>వెబ్‌సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని సూచించింది. డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగుస్తుంది. పోస్టుల సంఖ్య, పరీక్ష తేదీలు తదితర వివరాలను త్వరలో వెల్లడించనుంది.

News November 13, 2025

రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారా?

image

రబీలో మొక్కజొన్నను నవంబరు 15లోగా విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీని కోసం ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం. ఒక కిలో విత్తనానికి 6ml నయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 60 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందించాలి.

News November 13, 2025

రూ.30 కోట్లతో మినీ వేలంలోకి CSK?

image

IPL-2026 మినీ వేలానికి ముందు CSK రిటెన్షన్స్‌పై మరికొన్ని అప్‌డేట్స్ బయటికొచ్చాయి. రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్‌తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.