News August 4, 2024
కేరళకు చిరంజీవి, రామ్‌చరణ్ రూ.కోటి విరాళం

కేరళలోని వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ అండగా నిలిచారు. తామిద్దరం కలిసి కేరళ CMRFకు రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు చిరు ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు అల్లు అర్జున్ <<13774559>>రూ.25లక్షల<<>> విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News March 19, 2026
కాసేపట్లో వర్షం..

TG: వచ్చే రెండు గంటల్లో (4.30PM వరకు) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News March 19, 2026
‘ధురంధర్’ డైరెక్టర్ గురించి తెలుసా?

‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు మారుమోగుతోంది. ఇతడు కశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందినవారు. 1983లో ఢిల్లీలో జన్మించారు. క్రికెటర్ కావాలని కలలు కన్నా ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వదిలేశారు. ముంబైకి వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. 2019లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ అనే సినిమాతో సంచలనం సృష్టించారు. 2021లో హీరోయిన్ యామీ గౌతమ్‌ను పెళ్లి చేసుకోగా 2024లో కుమారుడు జన్మించాడు.
News March 19, 2026
ఖతర్‌పై దాడితో భారత్‌కు మరిన్ని కష్టాలు!

ఖతర్‌లో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్ <<19422796>>రాస్ లఫన్<<>>పై ఇరాన్ చేసిన దాడి భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇండియా 50% LNGని విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. దీంట్లో 40% వాటా ఖతర్‌దే. దీంతో భారత్‌లో పారిశ్రామిక, విద్యుదుత్పత్తి రంగాల్లో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే నేచురల్ గ్యాస్ దిగుమతులు తగ్గాయి. తాజా దాడితో సమస్య మరింత తీవ్రం కానుంది.


