News January 4, 2025
ఒక్క సినిమాకు రూ.75 కోట్లు తీసుకోనున్న చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాను ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోన్న మూవీ నుంచి విడుదలైన ఓ చిన్న పోస్టర్ భారీ అంచనాలు పెంచేసింది. అయితే, ఈ చిత్రం కోసం చిరు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు PINKVILLA తెలిపింది. కెరీర్‌లోనే అత్యధికంగా రూ.75 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News January 6, 2025
‘పుష్ప-2’ సంచలనం
భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా అల్లు అర్జున్ ‘పుష్ప-2’ నిలిచింది. ఈ సినిమా నిన్నటివరకు థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రూ.1,831 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంది. బాహుబలి-2 లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.1,810 కోట్లను దాటేసి రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా దంగల్(రూ.2వేల కోట్లకుపైగా) తొలి స్థానంలో ఉంది.
News January 6, 2025
పంచాయతీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డోర్ క్లోజ్: మంత్రి పొంగులేటి
TG: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ డోర్ క్లోజ్ అవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత పాలనలో పింక్ షర్ట్ వేసుకున్నవారికే ఇళ్లు ఇచ్చారని విమర్శించారు. ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేశామని చెప్పారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అసెంబ్లీకి రమ్మంటే రావడం లేదని దుయ్యబట్టారు. అప్పుడంటే కాలు విరిగింది, ఇప్పుడేమైందని ప్రశ్నించారు.
News January 6, 2025
రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చాం: నాదెండ్ల
AP: రాష్ట్రవ్యాప్తంగా నిన్నటికి 4.15 లక్షల మంది రైతుల నుంచి 2,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అన్నదాతల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం ఖరీఫ్‌లో 2.12 లక్షల మంది నుంచే ధాన్యం తీసుకుందని విమర్శించారు. తమ ప్రభుత్వం 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసిందని, ఇప్పటి వరకు రూ.6,083 కోట్లు చెల్లించిందని తెలిపారు.