News August 22, 2024

చిరంజీవి పుట్టినరోజు.. ‘విశ్వంభర’ పోస్టర్ వచ్చేసింది

image

మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను చిత్ర యూనిట్ పంచుకుంది. చేతిలో త్రిశూలంతో యాంగ్రీ లుక్‌లో ఉన్న చిరు పోస్టర్ ఆకట్టుకుంటోంది. మెగాస్టార్‌కు చిత్ర యూనిట్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. కాగా టీజర్‌ను త్వరలోనే విడుదల చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News February 5, 2026

వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవులు?

image

TG: వచ్చే వారంలో వరుసగా 3రోజులు స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంది. ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో పాఠశాలలకు హాలిడే ఇచ్చే ఛాన్స్ ఉంది. దీనిపై అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఇక 14న రెండో శనివారం, 15న ఆదివారం కావడంతో వరుసగా సెలవులు రానున్నాయి. కాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తవ్వగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో 11న ఎలక్షన్ జరగనుంది.

News February 5, 2026

టెన్త్ స్టూడెంట్లకు సీజనల్ హాస్టళ్లు

image

AP: స్కూళ్లకు సరిగ్గా రాని టెన్త్ విద్యార్థుల కోసం సీజనల్ హాస్టళ్ల ఏర్పాటుకు విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా డివిజన్ స్థాయిలో 50 వసతి గృహాలను సోమవారం ప్రారంభించనుంది. స్థానిక టీచర్లు తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను హాస్టళ్లకు తీసుకొస్తారు. అక్కడే వసతి, భోజనం సౌకర్యంతోపాటు ఉపాధ్యాయులతో తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తారు. టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తారు.

News February 5, 2026

గ్రూప్-1 నియామకాలపై నేడు హైకోర్టు తీర్పు

image

TG: గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. నియామకాలపై హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించనుంది. పరీక్షల నిర్వహణ, కరెక్షన్ వంటి నిబంధనల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయని పలువురు గతంలో HCని ఆశ్రయించారు. దీంతో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. దీనిపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వగా ఇవాళ తీర్పుతో 562 పోస్టుల భవితవ్యం తేలనుంది.