News February 21, 2025
చిరంజీవి తల్లికి అస్వస్థత.. స్పందించిన మెగా టీమ్

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై చిరు టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అంజనమ్మ అస్వస్థతకు గురి కాలేదని, రెగ్యులర్ చెకప్ కోసమే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొంది.
Similar News
News January 29, 2026
చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్లో సెక్షన్ 163

మున్సిపల్ ఎన్నికలు జరిగే చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్ పరిధిలో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుందని సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ పేర్కొన్నారు. ఈ సెక్షన్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ప్రజలు గుమి కూడి ఉండకూడదని సూచించారు. ప్రాణాంతక ఆయుధాలు చేతిలో పట్టుకోవడం నిషేధమన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయన్నారు.
News January 29, 2026
కరుంగలి మాల ఎందుకు ధరించాలంటే…?

కరుంగలి మాల ఆభరణమే కాదు! శక్తిమంతమైన రక్షణ కవచం కూడా. ఇది ప్రతికూల శక్తులను, చెడు దృష్టిని దరిచేరనీయదు. కుజ దోషం ఉన్నవారు దీనిని ధరిస్తే ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, సోమరితనాన్ని తగ్గించి మనశ్శాంతి ప్రసాదిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునే వారు, ఆర్థిక ఇబ్బందుల ఎదుర్కొంటున్నవారు ఈ పవిత్రమైన మాలను ధరించడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని సిద్ధ సంప్రదాయం చెబుతోంది.
News January 29, 2026
రెండు రోజుల లాభాలకు బ్రేక్

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ రెండు రోజుల లాభాల అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా కోల్పోయి 82,093 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు నష్టపోయి 25,274 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడమూ భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.


