News August 23, 2024
బర్త్‌డేకి సంప్రదాయ దుస్తుల్లో చిరు-చరణ్

నిన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిరుతో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోను చెర్రీ ఇన్‌స్టాలో పంచుకోగా వైరల్ అవుతోంది. ఆ పోస్టులో తండ్రికి చరణ్ బర్త్‌డే విషెస్ తెలిపారు. నాన్న అన్న పిలుపునకు బదులు హ్యాపీ బర్త్‌డే అప్పా అంటూ తమిళ స్టైల్లో విష్ చేయడం గమనార్హం. చిరు తిరుమల నుంచి తిరిగి రాగానే ఈ ఫొటో తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News March 31, 2026
ఏప్రిల్‌లో పాకిస్థాన్‌కు 3వేల మంది భారతీయులు

భారత్ నుంచి ఏప్రిల్‌లో దాదాపు 3000 మంది సిక్కు యాత్రికులు పాకిస్థాన్ వెళ్లనున్నారు. అక్కడి పంజాబ్ ప్రావిన్స్‌లో ఏప్రిల్ 10న మొదలయ్యే బైశాఖి ఉత్సవాల్లో వీరు పాల్గొంటారు. దీంతో పాటు లాహోర్, కర్తపూర్, ఎమినాబాద్, ఫరూఖాబాద్, నాన్‌కనా సాహిబ్ వంటి సిక్కుల పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నట్లు పాక్ అధికారులు తెలిపారు. ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా పాక్ ఏటా వీరి కోసం ప్రత్యేక ‘జథా’ వీసాలు కల్పిస్తోంది.
News March 31, 2026
‘3-2-1’ బ్యాకప్ రూల్‌తో మీ డేటా సేఫ్!

ఈ డిజిటల్ యుగంలో ముఖ్యమైన సమాచారం సేఫ్‌గా ఉండాలంటే బ్యాకప్ తప్పనిసరి. ఇందుకు 3-2-1 రూల్ ఫాలో అయితే మంచిదంటున్నారు నిపుణులు. ఓరిజినల్ డేటా కాక మరో రెండు అంటే మొత్తం 3 కాపీలు ఉండాలి. రెండు వేర్వేరు స్టోరేజీల్లో ఈ డేటా సేవ్ చేయాలి. మీ సిస్టమ్‌లో ఒకటి ఉంటే మరోటి హార్డ్‌డ్రైవ్‌లో పెట్టుకోవాలి. ఇక మరో కాపీ క్లౌడ్ సర్వర్‌లో స్టోర్ చేసుకోవాలి. దీంతో డేటా నష్టాన్ని నివారించొచ్చు. ఈరోజు వరల్డ్ బ్యాకప్ డే.
News March 31, 2026
జనగణన: మే1 నుంచి ఏపీలో, 16 నుంచి TGలో

జనగణన ప్రక్రియ AP, TGలో మే నుంచి ఆరంభం కానుంది. ముందుగా ఇళ్ల సర్వే ఏపీలో మే 1-30 వరకు, TGలో మే11-JUN9 వరకు ఉంటుంది. ఇక సెల్ఫ్ ఎన్యూమరేషన్ APలో మే16-30 తేదీల్లో, TGలో APR 26-మే10 తేదీ మధ్య జరుగుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్లో ప్రజలు ఇళ్ల సమాచారాన్ని సెన్సస్ వెబ్‌సైట్లో నమోదు చేయొచ్చు. ఇళ్ల సర్వేలో 34 ప్రశ్నలు అడుగుతారు. సెన్సెస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ ఇవాళ మీడియా భేటీలో వీటిని వెల్లడించారు.


