News October 17, 2025
చిత్త కార్తె.. వ్యవసాయ సామెతలు

✍️ చిత్త కురిస్తే చింతలు కాయును
✍️ చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును
✍️ చిత్తలో చల్లితే చిత్తుగా పండును
✍️ చిత్త, స్వాతుల సందు చినుకులు చాలా దట్టం
* రబీ పంటలకు చిత్త కార్తెలో పడే వానలు చాలా కీలకం. అందుకే ఆ కార్తె ప్రాధాన్యతను వెల్లడిస్తూ రైతులు ఈ సామెతలను ఉపయోగించేవారు.
* మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.
<<-se>>#AgricultureProverbs<<>>
Similar News
News October 17, 2025
‘డ్యూడ్’ రివ్యూ&రేటింగ్

ఎంతో ఇష్టపడే మరదలి ప్రేమను హీరో రిజక్ట్ చేయడం, తిరిగి ఎలా పొందాడనేదే ‘డ్యూడ్’ స్టోరీ. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ మరోసారి ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో అలరించారు. హీరోయిన్ మమితా బైజు స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కథ పాతదే అయినా కామెడీ, ట్విస్టులు బోర్ కొట్టకుండా చేస్తాయి. సెకండాఫ్ స్లోగా ఉండటం, ఎమోషన్స్ అంతగా కనెక్ట్ అవ్వకపోవడం మైనస్.
RATING: 2.75/5
News October 17, 2025
ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

AP: ఐపీఎస్ సంజయ్ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈనెల 31 వరకు రిమాండ్ పొడిగించడంతో ఆయనను కాసేపట్లో విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ నిందితుడిగా ఉన్నారు.
News October 17, 2025
సంస్కరణలతోనే ఉజ్వల భవిష్యత్తు: CBN

AP: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని CM CBN అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నాటిన కొంతకాలానికి చెట్లు ఫలాలు అందిస్తాయని, అదే మాదిరి సంస్కరణలు కూడా కొన్నిరోజుల తర్వాత ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని వివరించారు. GST 2.0పై నిర్వహించిన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. సంస్కరణల ప్రయోజనాల గురించి వారిని అడిగారు.