News March 16, 2024

చిత్తూరు: సిట్టింగ్‌లకే అవకాశం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎంపీలకే వైసీపీ మరో అవకాశం ఇచ్చింది. తిరుపతి నుంచి గురుమూర్తి, చిత్తూరు నుంచి రెడ్డప్ప, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెడ్డప్ప 2019లో, గురుమూర్తి ఉపఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఎంపీలుగా ఎన్నికయ్యారు. మంత్రి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి 2014, 19లో రాజంపేట MPగా ఎన్నికయ్యారు. ఆయన మూడోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Similar News

News December 31, 2025

చిత్తూరు జిల్లాలో 128 మందిపై డ్రగ్స్ కేసులు

image

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది 128 మంది మీద మాదక ద్రవ్యాల చట్టానికి సంబంధించి 42 కేసులను నమోదు చేశారు. 98 కేజీల గంజాయి, 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 ఎక్సైజ్ కేసులు నమోదు కాగా.. 327 మందిని అరెస్ట్ చేశారు. 4400 లీటర్ల సారా, 2124 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడింది. 21 వాహనాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 2024తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.

News December 31, 2025

చిత్తూరులో సెల్‌ఫోన్ దొంగల అరెస్ట్

image

చిత్తూరులో సెల్ ఫోన్లు చోరీచేసే ముగ్గురిని అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సీఐ నెట్టికంటయ్య వెల్లడించారు. స్థానిక పీవీకేఎన్ కళాశాల వద్ద అనుమానంగా తిరుగుతున్న రాజేష్, లోకేశ్, రాకేశ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనం చేసినట్లు నిర్ధారణ కావడంతో వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి చిత్తూరు జైలుకు తరలించారు.

News December 31, 2025

చిత్తూరు జిల్లాలో 74,447 ట్రాఫిక్ చలాన్లు

image

చిత్తూరు జిల్లాలో ఈసారి ట్రాఫిక్ చలాన్ల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది 54,454 చలాన్ల ద్వారా రూ.1.28 కోట్లు వసూలు చేయగా ఈసారి రూ.2.31 కోట్లు జరిమానా విధించారు. 2024లో 2519 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా ఈసారి 2772 ఫైలయ్యాయి. మొత్తంగా జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.కోటికి పైగా అదనంగా ఫైన్ వేశారు.