News February 18, 2025

CHMD: కీలకంగా మారనున్న మండల ఓటర్లు

image

హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండలంలో 2,179 పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలోనే అత్యధిక MLC ఓట్లు కలిగిన మండలంగా చిగురుమామిడి మండలం కీలకంగా మారనుంది. అయితే MLc అభ్యర్థుల దృష్టి ఈ మండలంపై ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇక్కడి ఓటర్లు ఎవరికీ పట్టం కడుతారో ఫిబ్రవరి 27వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Similar News

News March 23, 2025

కరీంనగర్: గీత ఐస్ క్రీమ్.. ఓ మధుర జ్ఞాపకం

image

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఆ రోజుల్లో గీత ఐస్ క్రీమ్ లేకుండా కాలం గడిచేది కాదు. ఒక్క రూపాయికి మాత్రమే లభించే గీత ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, పెప్సీ ఐస్ క్రీమ్‌లు ప్రస్తుత రోజుల్లో మధుర జ్ఞాపకంగా మారిపోయాయి. వందల రూపాయలు పెట్టి ఐస్ క్రీములు తిన్నప్పటికీ గీత ఐస్ క్రీమ్ మర్చిపోలేమని ఇప్పటికీ ఆ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. మీ చిన్నతనంలో గీత ఐస్ క్రీమ్ తిన్నారా? తింటే.. కింద కామెంట్ చేయండి..!

News March 23, 2025

కరీంనగర్: పదో తరగతి పరీక్షలు.. 14 మంది గైర్హాజరు

image

శనివారం నిర్వహించిన పదో తరగతి హిందీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 14 మంది గైర్హాజరయ్యారు. 12,491 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అదేవిధంగా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కరీంనగర్ నగరంలోని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

News March 23, 2025

నేడు జిల్లాలో వివిధ పార్టీల ముఖ్య నేతలు

image

KNR పట్టణంలో నేడు వివిధ పార్టీల ముఖ్య నేతలు పాల్గొననున్నారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తపస్ ఎమ్మెల్సీ అభినందన కార్యక్రమంలో పాల్గొంటారు. తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన అవేర్నెస్ పార్కును మంత్రి పోన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. అనంతరం KNRలో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. BRS KNR ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కరీంనగర్‌కు రానున్నారు.

error: Content is protected !!