News March 18, 2024
చోడవరం: నాలుగోసారి పోటీ పడుతున్న ప్రత్యర్థులు

చోడవరం నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి కేఎస్ఎంఎస్ రాజు నాలుగవసారి పోటీ పడనున్నారు. 2009,2014లో చోడవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు చేతిలో కరణం ధర్మశ్రీ ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మ శ్రీ, టీడీపీ అభ్యర్థి రాజును ఓడించారు. 2024 లో మళ్లీ వీరిద్దరూ తలపడుతున్నారు. ఈసారి గెలుపు ఎవరిదో కామెంట్ చేయగలరు.
Similar News
News April 20, 2025
గాజువాకలో బెట్టింగ్ ముఠా అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ పర్యవేక్షణలో బెట్టింగ్ ముఠాను ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గాజువాక పరిధిలో బీహెచ్‌పీవీ వద్ద బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 23 సెల్ ఫోన్లు, మూడు ల్యాప్టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతుందో ఆరా తీస్తున్నారు. కమిషనర్ ఏర్పాటు చేసిన స్పెషల్ టీం ఈ దాడులు చేసింది.
News April 20, 2025
విశాఖ: ఒంటరితనం భరించలేక సూసైడ్

ఒంటరితనం భరించలేక ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖలో ఆదివారం చోటు చేసుకుంది. పీఎం పాలెం సెకండ్ బస్టాప్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో మృతుడు నివస్తున్నాడు. తల్లిదండ్రులు, అన్నయ్య మృతి చెందడంతో ఒంటరిగా ఉన్న ఆయన మానసికంగా బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం KGHకి తరలించారు.
News April 20, 2025
విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్

విశాఖ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. విశాఖ నగర ప్రజలు లా అండ్ ఆర్డర్,క్రైమ్, దొంగతనాలు, ట్రాఫిక్ సమస్యలు,పలు పోలీస్ సంబంధిత సమస్యలపై రేపు ఉదయం 10 గంటల నుంచి వినతులు సమర్పించవచ్చన్నారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అయితే అంబేడ్కర్ జయంతి కారణంగా గత సోమవారం పీజిఆర్ఎస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.