News January 8, 2025

చాహల్ భార్యతో సన్నిహిత ఫొటో: స్పందించిన కొరియోగ్రాఫర్

image

టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ధనశ్రీతో కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉతేకర్‌ సన్నిహితంగా దిగిన ఫొటో SMలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతీక్ స్పందించారు. ‘ఎవరికైనా తమకు నచ్చిన కథలు, కథనాలు చెప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఉంది. కానీ ఒక చిన్న ఫొటోను వేరేవిధంగా చూడడం దారుణం. అబ్బాయిలూ ఎదగండి’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Similar News

News January 9, 2025

ఈ ఘటనకు బాధ్యులు ఎవరో తేల్చాలి: వైవీ సుబ్బారెడ్డి

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటన ఘోరమని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులు ఎవరో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ‘వైసీపీ హయాంలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకున్నాం. అధికారులతో టీటీడీ సరిగ్గా పనిచేయించలేదు. పోలీసులను కక్షసాధింపు చర్యలకు వాడుకుంటున్నారు. భక్తుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News January 9, 2025

కోహ్లీకి చెప్పే స్థాయి గంభీర్‌కు లేదేమో: కైఫ్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెప్పే స్థాయికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంకా చేరుకోలేదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అన్నారు. ‘కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో మార్పులు తీసుకొచ్చేంత దశకు గౌతీ ఎదగలేదు. ఇది సాధించడానికి ఆయనకు మరికొంత సమయం కావాలేమో. గౌతీ ముందుగా జట్టు కూర్పు గురించి ఆలోచించాలి. గంభీర్ కోచ్‌గా కూడా ఇంకా మరింత ఎదగాల్సి ఉంది’ అని కైఫ్ అభిప్రాయపడ్డారు.

News January 9, 2025

ACB ఆఫీసుకు KTR.. విచారణ ప్రారంభం

image

TG: కేటీఆర్ కొద్దిసేపటి కిందటే బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. కేటీఆర్ లాయర్ రామచందర్‌రావు కూడా కార్యాలయంలోకి వెళ్లగా విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే ఆయన్ను అనుమతించారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండీఏ నిధుల దుర్వినియోగం, క్యాబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు తదితరాలపై కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు సమాచారం.