News July 6, 2024
ఇండియన్ ఫ్యాన్స్ను చూసి ఆశ్చర్యపోయిన క్రిస్ లిన్

టీమ్ ఇండియా బస్ పరేడ్కు హాజరైన అభిమానులను చూసి ఆస్ట్రేలియా క్రికెటర్ క్రిస్ లిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అభిమానుల క్రేజ్ చూసి తనకు పిచ్చెక్కిందన్నట్లుగా ఎమోజీలతో లిన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్గా మారింది. కాగా క్రిస్ లిన్ ఐపీఎల్లో DC, SRH, MI, KKRకు ప్రాతినిధ్యం వహించారు. 42 మ్యాచులాడి 1329 పరుగులు చేశారు. ఆసీస్ తరఫున 4 వన్డేలు, 18 టీ20లు ఆడారు.
Similar News
News November 26, 2025
iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.
News November 26, 2025
న్యూస్ అప్డేట్స్ @4PM

*తిరుమల పరకామణి కేసులో ముగిసిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ.. 4 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
*ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో లొంగిపోయిన 41 మంది మావోయిస్టులు.. వారిపై రూ.1.19 కోట్ల రివార్డు
*HYD మాదాపూర్లో బోర్డు తిప్పేసిన NSN ఇన్ఫోటెక్ కంపెనీ.. 400 మంది నిరుద్యోగుల నుంచి రూ.3 లక్షల చొప్పున వసూలు
*ICC వన్డే ర్యాంకింగ్స్లో మరోసారి నం.1గా రోహిత్ శర్మ
News November 26, 2025
ప్రెగ్నెన్సీలో మాయ ఇలా ఉందా?

ప్రెగ్నెన్సీలో మాయ, శిశువు రక్తనాళాలు రక్షణ లేకుండా గర్భాశయ ముఖద్వారానికి దగ్గరగా ఉండటాన్నే వాసా ప్రీవియా అంటారు. దీనివల్ల డెలివరీ సమయంలో తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం ఏర్పడొచ్చు. ఈ పరిస్థితి ఉంటే నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. కొన్నిసార్లు సీ సెక్షన్ చేయాల్సి రావొచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు చెకప్స్ చేయించుకొని దీన్ని ముందుగానే గుర్తిస్తే ప్రమాదాన్ని తగ్గించొచ్చని నిపుణులు చెబుతున్నారు.


