News August 24, 2025
వారికి సిబిల్ స్కోర్ తప్పనిసరి కాదు: కేంద్రం

బ్యాంక్ నుంచి తొలిసారిగా లోన్ తీసుకునేవారికి మినిమమ్ సిబిల్ స్కోర్ నిబంధన తప్పనిసరి కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంపై ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి క్లారిటీ ఇచ్చారు. సిబిల్ స్కోర్ తక్కువగా ఉందన్న కారణంతో బ్యాంకులు అప్లికేషన్లు రిజెక్ట్ చేయలేవన్నారు. మరోవైపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంపెనీలు రూ.100కు మించి ఛార్జ్ చేసేందుకు అనుమతి లేదని తెలిపారు.
Similar News
News December 29, 2025
Money Tip: స్మార్ట్ సేవింగ్.. ఖర్చుకి చెక్!

శాలరీ రాగానే కొంత భాగాన్ని వేరే సేవింగ్స్ అకౌంట్‌కి ఆటోమేటిక్‌గా వెళ్లేలా సెట్ చేసుకోండి. దీనివల్ల మెయిన్ బ్యాలెన్స్‌లో డబ్బు తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి, అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చు. ‘ముందు పొదుపు-తర్వాతే ఖర్చు’ అనే పద్ధతి అలవడుతుంది. చేతిలో డబ్బు ఉంటే ఎలాగోలా ఖర్చయిపోతుంది. ఇలా ఆటోమేటిక్‌గా పక్కన పెడితే పెద్ద మొత్తంలో డబ్బు సేవ్ అవుతుంది. ఇది ఒక డిజిటల్ పిగ్గీ బ్యాంక్ లాంటిదన్నమాట!
News December 29, 2025
అదరగొట్టిన హంపి, అర్జున్.. మోదీ, CBN ప్రశంస

FIDE వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు తేజాలు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసి అదరగొట్టారు. దోహాలో జరిగిన ఈ టోర్నీలో హంపి మహిళల విభాగంలో, అర్జున్ ఓపెన్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఇది భారత్‌కు గర్వకారణమని PM మోదీ పేర్కొన్నారు. వారి పట్టుదల, అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రపంచ వేదికపై తెలుగు ఆటగాళ్ల ప్రతిభను చంద్రబాబు ప్రశంసించారు.
News December 29, 2025
సీఎం చంద్రబాబు ఫీల్ అవుతున్నారు: అనగాని

AP: జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడంపై CM చంద్రబాబు కూడా ఫీల్ అవుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కానీ రాయచోటితో ఉండటానికి ఎవరూ కోరుకోవట్లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో CM ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రాతినిధ్య ప్రాంతం ఇలా అవ్వడంపై మంత్రి రామ్‌ప్రసాద్ బాధలోనూ అర్థముందన్నారు. రానున్న రోజుల్లో ఆయన దీన్ని అధిగమించి, సీఎం ఆశీర్వాదంతో రాయచోటిని అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు.


