News April 22, 2025

BRS మాజీ MLA చెన్నమనేనిపై CID కేసు

image

TG: వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనేదానిపై ఈ కేసు నమోదైంది. జర్మనీ పౌరసత్వాన్ని దాచి ఆయన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐడీ FIR నమోదు చేసింది.

Similar News

News April 22, 2025

రేపు 39 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రేపు రాష్ట్రంలోని 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం(7), విజయనగరం(17), మన్యం(13), అల్లూరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. సిద్ధవటం-43.8, కర్నూలు-43.5, వతలూరు-42.9, పెద్ద దోర్నాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

News April 22, 2025

CM రేవంత్ వస్తేనే నా పెళ్లి: వైరా యువకుడు

image

TG: CM రేవంత్ వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు భీష్మించుకొని కూర్చున్నాడు. సీఎం ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటానన్నాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెబుతున్నాడు. వైరాకు చెందిన భూక్యా గణేష్ అనే యువకుడు MLA రామ్‌దాస్ మాలోతుకు ఓ లెటర్ రాశాడు. తన పెళ్లికి CMను తీసుకొచ్చే బాధ్యత ఆయనదేనంటూ విన్నవించాడు. ఆ లెటర్‌ను MLA కూడా CMకు పంపాడు.

News April 22, 2025

J&Kలో ఉగ్రదాడి.. ఖండించిన సీఎంలు

image

J&Kలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.

error: Content is protected !!