News March 19, 2024
స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుని చేర్చిన సీఐడీ

AP: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అచ్చెన్నాయుడిని సీఐడీ ఏ38గా చేర్చింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం అచ్చెన్నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. కాగా ఈ కేసులో చంద్రబాబు బెయిల్‌ని రద్దు చేయాలంటూ సీఐడీ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కి వాయిదా వేసింది.
Similar News
News April 11, 2025
14,956 ఎకరాల్లో పంట నష్టం!

TG: అకాల వర్షాల కారణంగా 14,956 ఎకరాల విస్తీర్ణంలో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి తెలిపింది. వాటిలో వరి, మొక్కజొన్న, మామిడి సహా పలు రకాల పంటలున్నాయని పేర్కొంది. ఒక్క గత నెలలో వానలకే 8408 ఎకరాల పంట నేలవాలిందని పేర్కొంది. ఈ నెల 3 నుంచి 9 వరకు 7 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన వానలు చేకూర్చిన నష్టంపై రూపొందించిన నివేదికను వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సమర్పించింది.
News April 11, 2025
ALERT: వచ్చే 3 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈ మూడు రోజులూ వడగళ్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News April 11, 2025
రాణా మావాడు కాదు: పాక్

26/11 ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రాణా తమ పౌరుడు కాదంటూ పాక్ పేర్కొంది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘గడచిన రెండు దశాబ్దాల్లో రాణా తన పాక్ పత్రాలను పునరుద్ధరించుకోలేదు. అతడు కెనడా జాతీయుడనేది సుస్పష్టం’ అని పేర్కొంది. మరోవైపు.. ముంబై ఉగ్రదాడుల్లో పాక్ నిఘా సంస్థ ISI పాత్ర ఉందన్న విషయం రాణాపై విచారణ అనంతరం బయటికొస్తుందని NIA వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.