News January 21, 2025

అమరావతిలో CII సెంటర్ ఏర్పాటు: చంద్రబాబు

image

AP: టాటా సంస్థ సహకారంతో రాజధాని అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ట్రైనింగ్, అడ్వైజరీ సేవలతో ఇండస్ట్రీల్లో కాంపిటీషన్ పెంచుతాం. భారత్ 2047 విజన్ కోసం ముందుకు వెళ్తాం. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Similar News

News December 15, 2025

డిసెంబర్ 15: చరిత్రలో ఈరోజు

image

✪ 1933: సినీ దర్శకుడు బాపు జననం
✪ 1950: భారత తొలి ఉపప్రధాని సర్దార్ వల్లభాయి పటేల్ మరణం (ఫొటోలో)
✪ 1952: ప్రత్యేకాంధ్ర పోరాటయోధుడు పొట్టి శ్రీరాములు మరణం
✪ 1973: మూవీ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా జననం
✪ 1990: హీరోయిన్ లావణ్య త్రిపాఠి జననం
✪ 2014: సంగీత దర్శకుడు చక్రి మరణం

News December 15, 2025

మెస్సీ.. ఇండియాలో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఇదే!

image

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ గురించే ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. 3 రోజుల భారత పర్యటనలో ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడకపోవడానికి ఓ కారణం ఉంది. ఆయన ఎడమ కాలుకు రూ.8వేల కోట్ల విలువ చేసే ఇన్సూరెన్స్ ఉంది. అయితే దేశం తరఫున, ఫ్రాంచైజీ లీగ్ మ్యాచుల్లో ఆడే సమయంలో కాలికి ఏమైనా జరిగితేనే ఇది వర్తిస్తుంది. ఎగ్జిబిషన్ మ్యాచులకు ఇది చెల్లుబాటు కాదు. దీంతో ఆయన మ్యాచుల్లో పూర్తి స్థాయిలో ఆడట్లేదని సమాచారం.

News December 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.