News December 28, 2024
2024లో స్టార్లకు ‘సినిమా’ కష్టాలు
ఈ ఏడాది మూవీల హిట్లు, ఫట్లు పక్కనపెడితే పలువురు టాలీవుడ్ స్టార్లను ‘సినిమా’ కష్టాలు వెంటాడాయి. ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్‌పై యువతి ఫిర్యాదు, లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టు కలకలం రేపాయి. HYDలో Nకన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, మంచు ఫ్యామిలీలో వివాదం, RGVకి నోటీసులు, బన్నీ అరెస్టు చర్చనీయాంశమయ్యాయి.
Similar News
News December 28, 2024
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ కామెంట్స్ సిగ్గుచేటని మండిపడింది. ఆయన మరీ దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించింది. అంత్యక్రియలపైనా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకే చెల్లిందని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ అడిగిన మెమోరియల్ నిర్మాణానికి సమయం ఉందని, దానిపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.
News December 28, 2024
RRR పనుల్లో కీలక పురోగతి
TG: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలిచింది. మొత్తంగా 4 భాగాలుగా విభజించి రూ.5,555 కోట్లతో పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. ప్యాకేజీ-1 సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్-రెడ్డిపల్లి, ప్యాకేజీ-2 రెడ్డిపల్లి-ఇస్లాంపూర్, ప్యాకేజీ-3 ఇస్లాంపూర్-ప్రజ్ఞాపూర్, ప్యాకేజీ-4 ప్రజ్ఞాపూర్-రాయగిరి వరకు పనులకు టెండర్లు దాఖలు చేయాలని పేర్కొంది.
News December 28, 2024
నితీశ్‌కు YS జగన్ అభినందనలు
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో సెంచరీతో అదరగొట్టిన భారత క్రికెటర్ నితీశ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ అభినందించారు. ‘మెల్బోర్న్లో చిన్న వయసులోనే సెంచరీ చేసిన నితీశ్‌కు శుభాకాంక్షలు. 21 ఏళ్లలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ప్రపంచస్థాయి జట్టుపై అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఆయన సాధించిన విజయం దేశం మొత్తానికి గర్వకారణం. నితీశ్ మరిన్ని విజయాలు సాధించాలి’ అని జగన్ ఆకాంక్షించారు.