News September 19, 2024
5,600 మంది ఉద్యోగులపై ‘సిస్కో’ వేటు

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా 4వేల మంది ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజం సిస్కో మరో దశ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 7 శాతం(5,600) సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అయితే ఏయే విభాగాలు ప్రభావితం అవుతాయో వెల్లడించలేదు. కాగా అక్కడ పని వాతావరణం ఏమాత్రం బాగాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఆ కంపెనీ వార్షిక ఆదాయం రికార్డు స్థాయిలో $54 బిలియన్లకు చేరింది.
Similar News
News September 18, 2025
అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదు: మంత్రి

AP: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం పెన్షన్లు ఇస్తోందని శాసనమండలిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అర్హులైన వారెవరికీ పెన్షన్లు తొలగించలేదని, నోటీసులు అందిన వారికి 2 నెలల్లో వెరిఫికేషన్ పూర్తిచేయాలని వైద్యశాఖకు చెప్పామన్నారు. లబ్ధిదారులు చనిపోతే వారి ఫ్యామిలీలో మరొకరికి పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. 50-59 ఏళ్ల వయసున్న వారిలో 11.98 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారని చెప్పారు.
News September 18, 2025
బంధాలకు భయపడుతున్నారా?

గామోఫోబియా అనేది రిలేషన్‌షిప్‌కు సంబంధించిన భయం. ఏదైనా బంధంలోకి వెళ్లడానికి, కమిట్మెంట్కు వీరు భయపడతారు. ఇదొక మానసిక సమస్య. ఈ ఫోబియా ఉన్నవాళ్లు ఒంటరిగా బతకడానికే ఇష్టపడతారు. దీన్నుంచి బయటపడటానికి మానసిక వైద్యుడిని సంప్రదించాలి. కౌన్సెలింగ్ తీసుకోవాలి. కుటుంబసభ్యులతో గడపాలి. పెళ్లికి సంబంధించి పాజిటివ్ విషయాలను తెలుసుకోవాలి. ఈ సమస్య నుంచి బయటపడి సరైన బంధంలోకి వెళ్లి జీవితాన్ని ఆస్వాదించండి.
News September 18, 2025
ప్రపంచ వెదురు దినోత్సవం – చరిత్ర

ప్రపంచ వెదురు సంస్థ(WBO) 8వ సమావేశం బ్యాంకాక్‌లో 2009లో జరిగింది. దీనికి 100 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. వెదురు ప్రాధాన్యతను గుర్తించి ఏటా సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించగా.. ప్రతినిధులంతా ఆమోదించారు. అప్పటి నుంచి ఏటా SEP-18న ప్రపంచ వెదురు దినోత్సవం నిర్వహిస్తూ.. వెదురు ప్రాముఖ్యత, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న మేలును ప్రజలకు వివరిస్తున్నారు.