News August 21, 2024

ఆర్జీకర్ ఆస్పత్రి వద్ద CISF భద్రత

image

కోల్‌కతా ఆర్జీకర్ ఆస్పత్రి భద్రతను కేంద్ర బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. CISF సీనియర్ అధికారులు ఉదయమే ఆస్పత్రిని సందర్శించారు. పరిస్థితులను సమీక్షించారు. ‘మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. పైవాళ్లు అప్పగించిన పని కోసం మేమిక్కడికి వచ్చాం. దాన్ని పూర్తిచేయనివ్వండి. అత్యున్నత అధికారులు మీకు మరిన్ని వివరాలు చెబుతారు’ అని సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారి కే ప్రతాప్ సింగ్ మీడియాకు తెలిపారు.

Similar News

News January 23, 2025

చైనా ప్లస్ వన్ పాలసీ అంటే ఇదే..

image

తాము చైనా ప్లస్ వన్‌తో పోటీపడుతున్నామని TG సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో చెప్పారు. అంటే ఒక దేశానికి చెందిన కంపెనీ చైనాలోనే కాకుండా భారత్, ఇండోనేషియా, మలేషియా లాంటి ఆసియా దేశాల్లోనూ వ్యాపారాన్ని విస్తరించడం. ఒకప్పుడు చైనాలో తక్కువ ధరకే లేబర్లు దొరికేవారు. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చైనా కంటే తక్కువ ధరకు సౌత్ ఈస్ట్ దేశాల్లో లేబర్ దొరుకుతుండటంతో ఈ పాలసీ ఫేమస్ అవుతోంది.

News January 23, 2025

భిక్షమేసిన వ్యక్తిపై కేసు నమోదు

image

MP ఇండోర్‌లో ఓ గుడి ముందు యాచకురాలికి భిక్షమేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకవేళ నేరం రుజువైతే కోర్టు అతడికి జైలు శిక్ష కానీ రూ.5 వేల ఫైన్ కానీ విధించనుంది. ఇండోర్‌ను బెగ్గింగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా భిక్షాటనను నగరంలో బ్యాన్ చేశారు. కొందరు యాచకులకు ఇళ్లు ఉన్నా, తమ పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా భిక్షమెత్తుకుంటున్నట్లు పోలీసులు గుర్తించడం విశేషం.

News January 23, 2025

‘గాంధీ తాత చెట్టు’ మూవీపై మహేశ్ బాబు ప్రశంసలు

image

దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతివేణి నటించిన ‘గాంధీ తాత చెట్టు’పై సూపర్ స్టార్ మహేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా మీతో పాటు ఉండిపోతుందని చెప్పారు. అహింస గురించి పదునైన కథను దర్శకురాలు పద్మ మల్లాది అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. చిన్నారి నేస్తం సుకృతి శక్తిమంతమైన ప్రదర్శనతో తనను గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ఈ కళాఖండాన్ని చూసి తీరాలని Xలో రాసుకొచ్చారు.