News November 14, 2024
సిటాడెల్ హనీ బన్నీ రికార్డ్

వరుణ్ ధవన్, సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ రికార్డ్ సృష్టించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా 200 దేశాల్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. 150 దేశాల్లో టాప్ 10లో దూసుకుపోతూ ప్రపంచంలోనే ఎక్కువ మంది చూసిన సిరీస్‌గా రికార్డ్ నెలకొల్పింది. డైరెక్టర్లు రాజ్, డీకే స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా సిటాడెల్కు వస్తున్న రెస్పాన్స్ థ్రిల్‌కు గురిచేస్తోందన్నారు. నవంబర్ 6న ఈ సిరీస్ రిలీజైన విషయం తెలిసిందే.
Similar News
News January 30, 2026
బాంబు పేలుళ్లు జరపాలని అధికారులు చెప్పారు: పంజాబ్ మాజీ సీఎం

బాంబు పేలుళ్లకు కుట్ర చేయాలని అధికారులు సూచించారని పంజాబ్ Ex CM రాజిందర్ కౌర్ భట్టల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఎన్నికల్లో గెలవాలంటే ఉగ్ర వాతావరణం సృష్టించాలని అధికారులు సలహా ఇచ్చారు. మార్కెట్లు, రైళ్లలో పేలుళ్లకు పాల్పడాలని చెప్పారు. కానీ వారి సూచనలను నేను తిరస్కరించా’ అని ఓ పాడ్ కాస్ట్లో అన్నారు. ఈ ఘటనపై లీగల్ యాక్షన్‌కు CM మాన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 1996-97లో CMగా కౌర్ పనిచేశారు.
News January 30, 2026
గుడ్‌న్యూస్.. త్వరలో టీమ్‌లోకి తిలక్ వర్మ?

T20 WCకు ముందు టీమ్ ఇండియాకు భారీ ఊరట లభించనుంది. గాయంతో NZ సిరీస్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ త్వరలో జట్టులో చేరనున్నట్లు BCCI వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం CoEలో ట్రైనింగ్‌లో ఉన్న ఆయన ఫిట్ అని తేలితే ఫిబ్రవరి 3న టీమ్‌లో చేరతారు. సిమ్యులేషన్ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 7న WC ప్రారంభం కానుండటంతో వర్మ చేరిక కలిసొస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News January 30, 2026
‘పుర’ సేవలు మరింత సులభం

AP: పౌరసేవలను మెరుగుపర్చేలా మున్సిపల్ శాఖ 123 మున్సిపాలిటీలను అనుసంధానిస్తూ ఇంటిగ్రేటెడ్ డ్యాష్ బోర్డు, వెబ్సైట్లను రూపొందించింది. పురమిత్ర అనే AI-ఆధారిత వర్చువల్ అసిస్టెంట్‌ను వీటికి ఇంటిగ్రేట్ చేసింది. పౌరులు మొబైల్ నంబరు నమోదుతో అవసరమైన సర్వీస్‌లు అందుకోవచ్చు. అసెస్మెంట్ నంబర్ లింకుతో ఫిర్యాదులు, ఆస్తి ఇతర వివరాలు పొందవచ్చు. నీటి సరఫరా, శానిటేషన్‌పై అధికారులు నిత్యం పర్యవేక్షిస్తారు.


