News November 21, 2024
వాట్సాప్‌లో పౌర సేవలు: చంద్రబాబు
AP: పలు పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. నివాస, పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ, ఆదాయ, అడంగల్, విద్య సంబంధిత పత్రాలన్నీ వాట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. విద్యుత్ శాఖలో 39, ఆర్టీసీలో 9, RTAలో 4, గ్రీవెన్స్‌లో 6, రెవెన్యూలో 16, మున్సిపల్, పంచాయతీరాజ్ సహా మొత్తం 150 సేవలు వాట్సాప్ ద్వారానే పొందవచ్చన్నారు. దీని ద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి తప్పుతుందన్నారు.
Similar News
News November 21, 2024
డేటింగ్‌పై స్పందించిన విజయ్ దేవరకొండ
తనపై వస్తున్న డేటింగ్ రూమర్స్‌పై స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ‘నా వయస్సు 35ఏళ్లు. నేనింకా సింగిల్ అని మీరు అనుకుంటున్నారా’ అని రిలేషన్షిప్ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చారు. తనకు ఎంతోకాలంగా తెలిసిన, కోస్టార్‌తోనే డేటింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
News November 21, 2024
అదానీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఒప్పందాలపై ప్రశ్న: జవాబు దాటేసిన రాహుల్
గౌతమ్ అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. NYC కోర్టులో ఆయనపై అభియోగాలు నమోదవ్వడంపై ప్రెస్మీట్లో మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అదానీతో చేసుకున్న ఒప్పందాలు, ప్రాజెక్టులను సమీక్షిస్తారా అన్న ప్రశ్నకు జవాబు దాటవేశారు. దీనిపై ఝార్ఖండ్‌లో వివరణ ఇచ్చానన్నారు. తాను క్రిమినాలిటీ, మోనోపలీపై మాట్లాడుతున్నానని, అదానీ, అంబానీ సహా ఎవరైనా రూల్స్ పాటించాలన్నారు.
News November 21, 2024
10వేల+ అప్లికేషన్స్ వచ్చాయి: జొమాటో CEO
జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్‌కు 10వేల కంటే ఎక్కువ <<14666126>>అప్లికేషన్స్<<>> వచ్చినట్లు సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. ఇందులో రకరకాల వ్యక్తులున్నట్లు తెలిపారు. చాలా డబ్బున్నవారు, కాస్త డబ్బు ఉన్నవారు, తమ వద్ద చెల్లించేందుకు డబ్బులు లేవని చెప్పినవారు, నిజంగానే డబ్బుల్లేని వారు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్లికేషన్‌కు సాయంత్రం 6 వరకే ఛాన్స్ ఉందన్నారు. కాగా ఈ పోస్టు కోసం రూ.20లక్షలు విరాళం ఇవ్వాలి.