News May 12, 2024
రఫా నుంచి పౌరులు వెళ్లిపోవాలి: ఇజ్రాయెల్

గాజాలోని రఫా ప్రాంతంపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న పాలస్తీనా పౌరులందరూ గాజాలోని వేరే ప్రాంతాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఈమేరకు ఆ దేశ సైనిక ప్రతినిధి ట్విటర్‌లో సూచించారు. దీంతో ఎక్కడికెళ్లినా దాడులు తప్పడం లేదంటూ పాలస్తీనా పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత రాత్రి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 37మంది పౌరులు మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Similar News
News March 20, 2026
PHOTO GALLERY: గద్దర్ అవార్డుల వేడుక

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, జయసుధ, నారాయణ మూర్తి, రామ్ చరణ్, సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, అవార్డుల విజేతలు హాజరయ్యారు. పైన గ్యాలరీలో కొన్ని ఫొటోలను చూడొచ్చు.
News March 20, 2026
మార్చి 20: చరిత్రలో ఈ రోజు

1351: ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణం
1602: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన
1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
1987: టాలీవుడ్ సింగర్ హరిచరణ్ జననం
2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం(ఫొటోలో)
*అంతర్జాతీయ సంతోష దినం
News March 20, 2026
తండ్రి అయిన RCB కెప్టెన్

RCB కెప్టెన్ రజత్ పాటీదార్ తండ్రి అయ్యారు. ఆయన భార్య గుంజన్ పండంటి మగ బిడ్డకు నిన్న జన్మనిచ్చారు. దీంతో IPL ప్రారంభానికి వారం రోజుల ముందే వారి ఇంట్లో ఆనందం వెల్లివెరిసింది. మధ్యప్రదేశ్‌లోని ఇండర్‌కు చెందిన పాటీదార్ 2022లో గుంజన్‌ను వివాహమాడారు. మరోవైపు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కూడా <<19424001>>ఉగాది రోజునే<<>> మరోసారి తండ్రయ్యారు. దినేశ్, పాటీదార్ ఒకేరోజు పుట్టడం(జూన్ 1) విశేషం.


