News October 17, 2024
సిటిజన్‌షిప్ యాక్ట్: సెక్షన్ 6Aపై 4-1తో సుప్రీం చారిత్రక తీర్పు

సిటిజన్‌షిప్ యాక్ట్ సెక్షన్ 6Aకు చట్టబద్ధత ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1 తేడాతో తీర్పునిచ్చింది. దీనిని మార్చే అధికారం పార్లమెంటుకే ఉందని స్పష్టం చేసింది. బంగ్లా నుంచి అస్సాం వచ్చిన వలసదారుల సమస్యకు రాజకీయ పరిష్కారమే సెక్షన్ 6A అని CJI చంద్రచూడ్ అన్నారు. 1985లో ప్రవేశపెట్టిన ఈ చట్టంతో 1971, MAR 24 ముందునాటి వలసదారులకు భారత పౌరసత్వం ఇస్తారు. తర్వాత వచ్చినవాళ్లు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
Similar News
News October 25, 2025
నాగ దేవతను పూజిస్తే కలిగే ఫలితాలు

నాగుల చవితి రోజున నాగ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. సర్వ రోగాలు తొలగిపోయి, సౌభాగ్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. సంతానం లేని దంపతులకు నాగ దేవత అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యకర జీవితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నేడు నాగ దేవతను పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే అదృష్టం వెన్నంటే ఉంటుందని ప్రగాఢ విశ్వాసం.
News October 25, 2025
CIAను బురిడీ కొట్టించి ఆడవేషంలో తప్పించుకున్న లాడెన్!

అల్‌ఖైదా అధినేత లాడెన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని CIA మాజీ అధికారి జాన్ కిరాయకో వెల్లడించారు. ‘2001లో 9/11 దాడి తర్వాత అఫ్గాన్‌లో అల్‌ఖైదా స్థావరాన్ని చుట్టుముట్టాం. కానీ అల్‌ఖైదా వ్యక్తే అనువాదకుడిగా US మిలిటరీలో చేరాడని మాకు తెలియదు. పిల్లలు, మహిళల్ని పంపిస్తే లొంగిపోతామని ఉగ్రవాదులు చెప్తున్నారని అతడు ఆర్మీని ఒప్పించాడు. దీంతో అక్కడే ఉన్న లాడెన్ ఆడవేషంలో తప్పించుకున్నాడు’ అని తెలిపారు.
News October 25, 2025
ఒత్తయిన జుట్టు కోసం ఇలా చేయండి

ఒత్తయిన జుట్టు కోసం మహిళలు ఎన్నో ప్రొడక్టులు వాడుతుంటారు. అలాకాకుండా ఇంట్లో లభించే పదార్థాలతోనే జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఒక కీరాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో పెసరపిండి, శనగపిండి, మెంతి పొడి(ఒక్కో స్పూన్ చొప్పున) కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకల కుదుళ్ల వరకు పట్టించి 30ని. తర్వాత తల స్నానం చేయాలి. వారంలో ఓసారి ఈ ప్యాక్ ట్రై చేస్తే ఒత్తయిన జట్టు సాధ్యమవుతుంది.


