News March 24, 2024
బాల్య వివాహం, బహుభార్యత్వానికి నో చెబితేనే పౌరసత్వం: అస్సాం సీఎం
బెంగాలీ మాట్లాడే బంగ్లాదేశీ ముస్లిం(మియా)లకు పౌరసత్వం ఇవ్వడానికి అస్సాం CM హిమంత బిశ్వ శర్మ పలు కండీషన్లు పెట్టారు. ‘బహుభార్యత్వం, బాల్య వివాహాలకు నో చెప్పాలి. ఇద్దరు పిల్లలకే పరిమితం కావాలి. మహిళల విద్యను ప్రోత్సహించాలి. మదర్సాలకు దూరంగా ఉండి, ఇంజినీరింగ్, మెడిసిన్ లాంటి విద్యపై దృష్టిసారించాలి. ఇక్కడి సమాజ సంస్కృతులను అనుసరిస్తే వారిని గుర్తించడానికి మాకెలాంటి ఇబ్బంది లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 18, 2025
నేటి నుంచి U19 మహిళల టీ20 WC
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్ గ్రూప్-ఏలో ఉన్నాయి. టీమ్ ఇండియా తన తొలి మ్యాచును రేపు WIతో ఆడనుంది. నేడు తొలి మ్యాచు ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో చూడవచ్చు. 2023లో జరిగిన తొలి ఎడిషన్లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News January 18, 2025
ఢిల్లీ ఎన్నికలు: అన్ని పార్టీలదీ అదే దారి!
తాము ఉచితాలకు వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ సైతం ఢిల్లీ ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించింది. ప్రతి నెల మహిళలకు రూ.2,500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. మరోవైపు మహిళలకు కాంగ్రెస్ రూ.2,500, ఆప్ రూ.2,100 ఇస్తామని హామీలు ఇచ్చాయి. ఇలా దేశ రాజధానిలో మహిళల ఓట్ల కోసం పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఈ ఉచితాల హామీలపై మీ కామెంట్?
News January 18, 2025
శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే?
AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ వంటివాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.