News August 26, 2024

సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున అందజేత

image

TG: రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించింది. వారికి సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్‌కు రాష్ట్రం నుంచి 135 మంది అర్హత సాధించగా, వారందరికీ సింగరేణి సంస్థ ద్వారా ఆర్థికసాయం అందజేశారు.

Similar News

News February 8, 2026

రేవంత్‌ను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట: బండి సంజయ్

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ను గెలిపిస్తే అన్ని పన్నులు పెంచుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ‘బీజేపీని గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా. ఢిల్లీ వెళ్తే రేవంత్‌ను అందరూ చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారట. అలాంటి వ్యక్తికి ఎవరైనా నిధులిస్తారా? ‘ అని చొప్పదండి ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. తనకు బీపీ, షుగర్ లేవని, తన వల్ల KCRకి అవి వచ్చాయని పేర్కొన్నారు.

News February 8, 2026

జైపూర్‌లోని ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

జైపూర్‌లోని <>ESIC<<>> హాస్పిటల్ 43 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు ఫిబ్రవరి 25న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి MBBS+PG/DNB/డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.225. SC, ST, PwBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News February 8, 2026

JEE మెయిన్ ‘కీ’లో 17 తప్పులు? బోనస్ మార్కుల కోసం డిమాండ్

image

JEE మెయిన్ 2026 సెషన్-1 ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’లో 17 తప్పులున్నాయని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఫిజిక్స్‌లో ఎక్కువ పొరపాట్లు దొర్లాయని, వీటి వల్ల విద్యార్థుల ర్యాంకులు తలకిందులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తప్పుగా ఉన్న 10 ప్రశ్నలకు బోనస్ మార్కులు ఇవ్వాలని, మిగిలిన 7 ప్రశ్నల సాంకేతిక లోపాలను సరిదిద్దాలని NTAను డిమాండ్ చేసింది. Feb 12న తుది ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.