News June 15, 2024

రేపే సివిల్స్ ప్రిలిమ్స్

image

యూపీఎస్సీ నేతృత్వంలో రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9.30 నుంచి ఉ.11.30 వరకు పేపర్-1, మం.2.30 నుంచి సా.4.30 వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు 30 నిమిషాల ముందే సెంటర్లను మూసివేస్తారు. ఆ తర్వాత పర్మిషన్ ఉండదు. బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫొటో ఐడీ కార్డు తీసుకెళ్లాలి.

Similar News

News January 16, 2025

‘పుష్ప-2’ టికెట్ ధరలు తగ్గింపు

image

ఈ నెల 17 నుంచి మరో 20 నిమిషాల అదనపు నిడివితో ‘పుష్ప-2’ ప్రదర్శితం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైజాంతో పాటు నార్త్ ఇండియాలో టికెట్ రేట్లను చిత్ర యూనిట్ తగ్గించింది. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.112, మల్టీప్లెక్స్‌లలో రూ.150గా ఫిక్స్ చేసినట్లు తెలిపింది. మరోవైపు నార్త్ ఇండియాలో రూ.112కే టికెట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ ఇప్పటికే రూ.1,800 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది.

News January 16, 2025

కోర్టుల్లో వారికి ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలి: SC

image

దేశంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్‌లో ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులు, స్త్రీలు, పురుషుల కోసం వేర్వేరు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు(SC) ఆదేశించింది. ఇది సౌకర్యానికి సంబంధించినది కాదని కనీస అవసరమని పేర్కొంది. వీటి ఏర్పాటు బాధ్యత ప్రభుత్వం, స్థానిక అధికారులదని తెలిపింది. కోర్టు ఆవరణల్లో సామాన్యులకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

News January 16, 2025

నేడు ఈడీ విచారణకు కేటీఆర్

image

TG: ఫార్ములా-ఈ కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ నెల 7నే విచారణకు హాజరుకావాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో గడువు కోరడంతో నేడు రావాలని నోటిసులిచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.