News October 25, 2024
ఢిల్లీ వాయు కాలుష్యంపై సీజేఐ ఆందోళన.. మార్నింగ్ వాక్కు గుడ్‌బై!

ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా తాను మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేసినట్లు సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. గాలి నాణ్యత క్షీణించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ సూచన మేరకు మార్నింగ్ వాక్కు వెళ్లట్లేదని, దీని వల్ల శ్వాసకోశ వ్యాధులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 283గా నమోదైంది. కాలుష్యం పెరగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోందని స్థానికులు చెబుతున్నారు.
Similar News
News January 26, 2026
ఆపరేషన్ సిందూర్.. పాక్ గాలి తీసిన స్విస్ థింక్ ట్యాంక్!

ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయమని స్విస్ థింక్ ట్యాంక్ CHPM తేల్చి చెప్పింది. ప్రారంభంలో పాక్ హడావిడి చేసినా తర్వాత ఇండియన్ ఎయిర్ సుపీరియారిటీ ముందు తలవంచక తప్పలేదని పేర్కొంది. ప్రత్యర్థి ఎయిర్ డిఫెన్స్‌ను మన వాయుసేన పూర్తిగా ధ్వంసం చేసి పాక్ ఎయిర్ బేస్‌లను కోలుకోలేని దెబ్బకొట్టిందని తేల్చింది. భయపడి 4 రోజుల్లోనే పాక్ Ceasefire కోరుకున్నట్లు తెలిపింది. భారత్‌ది బలమైన ప్రతీకారమని పేర్కొంది.
News January 26, 2026
రాహుల్‌కు మూడో వరుసలో సీటుపై వివాదం

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రొటోకాల్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంటులో ప్రతిపక్ష నేతలు ఖర్గే, రాహుల్ గాంధీలకు మూడో వరుసలో సీటు కేటాయించడంపై రగడ మొదలైంది. ప్రతిపక్ష నేతకు కేంద్రమంత్రులకు ఇచ్చే గౌరవం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వారిని అవమానించిందని INC నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆత్మన్యూనతతో బాధపడుతోందని విమర్శిస్తున్నారు.
News January 26, 2026
హిందీ అనేక మాతృభాషలను మింగేసింది: ఉదయనిధి

తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నాలను ఒప్పుకునేది లేదని Dy.CM ఉదయనిధి స్పష్టం చేశారు. 1960sలో హిందీ వ్యతిరేక ఆందోళనల్లో అమరులైన వారికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఉత్తరాదిలో హిందీని ప్రవేశపెట్టడం వల్ల హర్యాన్వీ, భోజ్‌పురి, బిహారీ, ఛత్తీస్‌గఢీ వంటి మాతృభాషలు కనుమరుగయ్యాయి. ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక వారసత్వాన్ని హిందీ నాశనం చేస్తుందనడానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.


