News August 20, 2024

1973 నాటి భయంకర ఘటనను గుర్తు చేసిన సీజేఐ

image

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై విచారణ సమయంలో వైద్య రంగంలో ఘోరమైన ఘటన అంటూ అరుణా షాన్‌బాగ్ స్టోరీని CJI డీవై చంద్రచూడ్ ప్రస్తావించారు. ముంబైలోని KEM ఆస్పత్రిలో 1973 NOV 27 రాత్రి నర్స్ అరుణపై వార్డ్‌బాయ్ అత్యాచారం చేశాడు. కుక్కల్ని కట్టేసే గొలుసును ఆమె గొంతుకు బిగించాడు. దీంతో మెడ నుంచి మెదడుకు వెళ్లే నాడులు దెబ్బతిన్నాయి. ఆపై 42 ఏళ్ల పాటు కోమాలోనే ఉన్న ఆమె 2015లో మృతి చెందారు.

Similar News

News November 16, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* ఎర్ర చందనం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు డ్రోన్లతో పహారా కాస్తున్నట్లు డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
* మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు DSP మహేంద్ర తెలిపారు. మరో 8 మంది నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
* గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్‌కు ఐదేళ్ల తర్వాత విమానాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

News November 16, 2025

మరో అల్పపీడనం.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఈనెల 17, 18 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది.

News November 16, 2025

ఆ ఐదేళ్లు రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్: చంద్రబాబు

image

AP: 2019-24 కాలం రాష్ట్రానికి బ్యాడ్ పీరియడ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సమయంలో ఇండస్ట్రీలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. సోలార్ రంగం అభివృద్ధి చెందకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎకో సిస్టమ్ నిర్మించే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ కారణంతోనే రాష్ట్రానికి గూగుల్ వచ్చిందని పేర్కొన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు తయారు చేస్తున్నామని చెప్పారు.