News May 28, 2024
‘సీజేఐ చూసుకుంటారు’.. కేజ్రీవాల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. బెయిల్ పొడిగింపుపై తక్షణ విచారణ చేపట్టాలన్న ఆయన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయాన్ని CJI డీవై చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్తామని వెకేషన్ బెంచ్ వెల్లడించింది. దీనిపై ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేసింది. కాగా తన ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు.
Similar News
News January 22, 2025
బిల్‌గేట్స్‌తో భేటీ కానున్న చంద్రబాబు
AP: దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.
News January 22, 2025
BREAKING: సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్
హైదరాబాద్‌లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి.
News January 22, 2025
OTTలోకి వచ్చేస్తున్న పుష్ప-2.. ఎప్పుడంటే?
బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన పుష్ప-2 మూవీ OTT స్ట్రీమింగ్ డేట్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 29 లేదా 31న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం 3 గంటల 40 నిమిషాల నిడివితో ఉన్న రీలోడెడ్ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శిస్తుండగా, OTTలోనూ ఇదే వెర్షన్‌నే రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.1850 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది.