News October 4, 2025
భారత న్యాయవ్యవస్థపై CJI కీలక వ్యాఖ్యలు

భారత న్యాయవ్యవస్థ బుల్డోజర్ రూల్‌తో కాకుండా Rule of Law ప్రకారం నడుస్తోందని CJI గవాయ్ పేర్కొన్నారు. నిందితులు దోషులుగా తేలకముందే వారి ఆస్తుల్ని బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని సుప్రీం నిరోధించి మార్గదర్శకాలిచ్చినట్లు మారిషస్‌లో జరిగిన సభలో చెప్పారు. ఏదైనా చట్టబద్ధం చేసినంత మాత్రాన అది న్యాయమైపోదని అన్నారు. సుప్రీం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులను గుర్తుచేస్తూ దేశ న్యాయవ్యవస్థ ప్రత్యేకతలను వివరించారు.
Similar News
News October 4, 2025
పెట్రోల్ కొట్టిస్తున్నారా?.. ఇలా జరిగితే అంతే!

ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన E20 పెట్రోల్ చాలా బంకుల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పెట్రోల్ వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా బంక్ యాజమాన్యాలు అవగాహన కల్పిస్తున్నాయి. ‘ఇథనాల్ నీటిని వేగంగా ఆకర్షిస్తుంది. వాషింగ్ & వర్షాల సమయంలో ట్యాంకులోకి నీరు చేరకుండా చూసుకోవాలి. నీరు తగిలితే ట్యాంకులో ఓ ప్రత్యేకమైన పొర ఏర్పడి వాహనం స్టార్ట్ కావడం కష్టతరమవుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News October 4, 2025
స్థానిక ఎన్నికలపై SEC కాల్ సెంటర్

TG: స్థానిక ఎన్నికలకు రెడీగా ఉన్నామని కోర్టుకు నివేదించినందున SEC తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. BC రిజర్వేషన్లపై ఓవైపు హైకోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. అయితే ఎన్నికలకు అనుమతిస్తే అప్పటికప్పుడు ఏర్పాట్లు కష్టమవుతుందనే కొన్ని ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎన్నికల సమాచారం, ఫిర్యాదులు స్వీకరించేందుకు 92400 21456 నంబర్‌తో తాజాగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.
News October 4, 2025
వెస్టిండీస్.. ఇదేం ఆట!

ఒకప్పుడు వెస్టిండీస్ జట్టంటే విధ్వంసకర బ్యాటర్లు, నిప్పులు చెరిగే బౌలర్లతో నిండి ఉండేది. ఇప్పుడు కనీసం పోటీ ఇవ్వలేని దీనస్థితికి దిగజారింది. భారత్‌తో తొలి టెస్టులో కనీసం 2 రోజులు కూడా నిలబడలేకపోయింది. నిలకడ లేని ఆటగాళ్లున్న WIకు టెస్టులు సెట్ కావడం లేదు. ఒకవేళ ఆడించినా IND, AUS, ENG, NZ, SAతో కాకుండా చిన్న దేశాలతోనే సిరీస్‌లు నిర్వహించాలని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. మీ కామెంట్?