News January 20, 2025
పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందో లేదో స్పష్టత రావాలి: DGP

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ కలకలంపై DGP ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ ఎగిరిందో లేదా స్పష్టత రావాల్సి ఉందని, సాయంత్రానికి విచారణ కొలిక్కి వస్తుందన్నారు. RSI మాత్రమే డ్రోన్ ఎగిరినట్టు చెబుతున్నారని వెల్లడించారు. పవన్ సాలూరు పర్యటనలో నకిలీ IPS అధికారి ఘటనలో పోలీస్ శాఖ వైఫల్యం లేదని DGP వివరించారు. ఆయన భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.
Similar News
News December 21, 2025
HYD: బాబోయ్.. ఇదేం చలిరా బాబూ

నగరం చలికి వణికిపోతోంది. పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. స్వెటర్ లేనిదే బయటకు వెళ్లడం కష్టమైపోతోంది.
నగరగంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చలి మరీ దారుణంగా ఉంటోంది. ఈ పరిస్థితి మరో 3 రోజులు ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరిక. శేరిలింగంపల్లిలో 6.3, రాజేంద్రనగర్‌లో 7.4, మల్కాజిగిరిలో 7.5, చందానగర్‌లో 8.4, అల్వాల్‌లో 9.4°Cనమోదై చుక్కలు చూపుతోంది.
News December 21, 2025
వంటింటి చిట్కాలు మీకోసం

* వడియాల పిండిలో కాస్త నిమ్మరసం వేస్తే వడియాలు తెల్లగా వస్తాయి.
* కూరగాయలు ఉడికించాక రంగు పోకుండా ఉండాలంటే నీళ్లలో చిటికెడు పసుపు, చెంచా ఆలివ్ ఆయిల్ వెయ్యాలి.
* నిల్వ పచ్చళ్లు భద్రపరిచే ముందు ఆ డబ్బాలో కాస్తంత ఇంగువ కాల్చి, వెయ్యాలి.
* చేప ముక్కల్ని నిల్వ చెయ్యాలంటే వాటికి కాస్త ఉప్పు రాసి డీప్ ఫ్రీజర్‌లో ఉంచాలి. దానివల్ల ముక్కలు మంచు పేరుకుపోకుండా, తాజాగా ఉంటాయి.
News December 21, 2025
అంటే.. ఏంటి?: Wunderkind

చిన్నవయసులో అసాధారణ ప్రతిభ గల, విజయాలు సాధించిన వారి గురించి చెప్పేటప్పుడు వారిని Wunderkind పర్యాయ పదంతో ప్రస్తావిస్తారు. జర్మన్ భాషలోని Wunder (wonder), Kind (child) పదాల నుంచి ఇది పుట్టింది.
Ex: AI Wunderkind Alexander Wang..
28సం.ల అలెగ్జాండర్ వాంగ్ స్కేల్ AI సంస్థను స్థాపించగా $14.8 బిలియన్లు చెల్లించి జుకర్‌బర్గ్ అందులో 49% వాటా కొన్నారు. (రోజూ 12pmకు అంటే ఏంటి పబ్లిష్ అవుతుంది)
<<-se>>#AnteEnti<<>>


