News February 26, 2025
బాలీవుడ్ నటుడి విడాకుల వార్తలపై క్లారిటీ

బాలీవుడ్ నటుడు గోవింద విడాకులు తీసుకోబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన సన్నిహితులు స్పందించారు. భార్య సునీతతో గోవిందకు అభిప్రాయభేదాలు ఉన్నాయని, అయితే అవి విడాకులు తీసుకునేంత పెద్దవి కాదని ఆయన మేనేజర్ చెప్పారు. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విడాకుల వార్తలన్నీ అవాస్తవమని గోవింద మేనకోడలు ఆర్తిసింగ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని కోరారు.
Similar News
News February 26, 2025
స్విగ్గీ మెనూలో బీఫ్ ఐటమ్స్.. యూజర్లు ఫైర్

స్విగ్గీ ప్లాట్ఫామ్లో బీఫ్ ఐటమ్స్ను లిస్ట్ చేయడంపై పలువురు యూజర్లు మండిపడుతున్నారు. HYDలోని ఓ రెస్టారెంట్ మెనూలో బీఫ్ ఐటమ్స్ను స్విగ్గీ చూపించింది. దీని గురించి ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘స్విగ్గీని అన్ ఇన్స్టాల్ చేస్తాం. బీఫ్ బిర్యానీ అమ్మడం లీగలేనా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారని GHMC తెలిపింది.
News February 26, 2025
నేను BRSలోనే ఉన్నా: గద్వాల్ ఎమ్మెల్యే

TG: తాను BRSలోనే ఉన్నానని గద్వాల్ MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్లో ఉన్నట్లు కొందరు ఫ్లెక్సీలు వేసి అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై గద్వాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా కృష్ణమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్లో చేరి మళ్లీ బీఆర్ఎస్ గూటికి వచ్చిన విషయం తెలిసిందే.
News February 26, 2025
మార్చి 1న ‘కన్నప్ప’ టీజర్!

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 1వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.