News August 17, 2025
PAC భేటీ తర్వాత ఎన్నికలపై క్లారిటీ: మహేశ్ గౌడ్

TG: BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని TPCC చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. SEP 30లోపు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాకపోతే, కోర్టును మరింత సమయం కోరాలనే ఆలోచనలో CM రేవంత్ ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) భేటీలో ఎన్నికలపై క్లారిటీ వస్తుందని చెప్పారు. పార్టీపరంగా రిజర్వేషన్ల కల్పన, ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశాలను పరిశీలిస్తున్నామన్నారు.
Similar News
News August 17, 2025
పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదు: ప్రకాశ్ రాజ్

మహిళల ప్రైవసీ కారణంగా CCTV ఫుటేజీ ఇవ్వలేమన్న EC <<17435042>>ప్రకటనపై<<>> సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. ‘మీరు పోలింగ్ కేంద్రాల్లో CCTVలు పెట్టే ముందు మహిళల అనుమతి తీసుకున్నారా? పోలింగ్ బూత్‌లు డ్రెస్ ఛేంజింగ్ రూమ్స్ కాదు. మీరు చెప్పే సాకులపై మాకు ఆసక్తి లేదు. పారదర్శకత కావాలి’ అని Xలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని, పోలింగ్ CCTV ఫుటేజ్‌లను బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
News August 17, 2025
ఆసియా కప్: హర్ష భోగ్లే టీమ్ చూశారా?

వచ్చే నెల 9న ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లే 15 మందితో కూడిన ఇండియన్ టీమ్‌ను ప్రకటించారు. జైస్వాల్, గిల్‌కు ఇందులో చోటు దక్కకపోవడం గమనార్హం.
టీమ్: అభిషేక్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, అక్షర్, సుందర్, శాంసన్, జితేశ్ శర్మ, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్.
ఈ టీమ్‌పై మీ కామెంట్?
News August 17, 2025
మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా?

TG: కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈసారి లబ్ధిదారులకు బియ్యంతో పాటు సంచిని ఇవ్వనున్నారు. అటు కేంద్రం ఆదేశాలతో జూన్‌లో ఒకేసారి 3 నెలల కోటా బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. దీంతో జులై, ఆగస్టులో రేషన్ షాపులను మూసివేశారు. సెప్టెంబర్ నుంచి పాత పద్ధతిలో నెలవారీ కోటాను పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.