News November 19, 2024
ఛాంపియన్స్ ట్రోఫీపై క్లారిటీ అప్పుడే!
వచ్చే ఏడాది పాకిస్థాన్లో నిర్వహించాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం వీడలేదు. ఆ దేశంలో ఆడేందుకు బీసీసీఐ నో చెప్పగా, హైబ్రిడ్ విధానంపై పాక్ బోర్డ్ మౌనం పాటిస్తోంది. దీనిపై స్పష్టత తెచ్చేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ, ఈవెంట్ జరగాల్సిన పాకిస్థాన్తో పాటు మిగతా జట్ల బోర్డులతో చర్చలు జరుపుతోంది. ఈ వారంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్పై క్లారిటీ వస్తుందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News November 30, 2024
నేడు స్కూళ్ల బంద్కు పిలుపు
TG: నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్కు SFI, AISF, PDSU లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యతలేని ఆహారం కారణంగా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు వెలుగుచూస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్లిష్టమైన సమస్యలను హైలైట్ చేయడమే ఈ బంద్ లక్ష్యమని తెలిపాయి. వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేశాయి.
News November 30, 2024
శ్రీవారి ఆలయం ముందు ఫొటోషూట్పై చర్యలు: టీటీడీ
AP: నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయం ముందు ఫొటో షూట్ నిర్వహించిన వంశీనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. రెండు రోజుల క్రితం కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరుడు వంశీనాథ్ స్వామివారిని దర్శించుకున్నాక గుడి ముందు ఫొటోగ్రాఫర్లతో ఫొటోలు, వీడియోలు తీయించుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఇది కాస్త టీటీడీ దృష్టికి రావడంతో స్పందించింది.
News November 30, 2024
ALERT.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు!
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, నల్గొండ, సూర్యాపేట, WGL, మహబూబాబాద్, HNKలో వర్షం పడే ఛాన్స్ ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఎల్లుండి కరీంగనర్, PDPL, సిద్దిపేట, RR, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరితో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది.