News July 10, 2025
సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై నేడు క్లారిటీ!

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. దీంతో పాటు రేషన్ కార్డుల పంపిణీ, బనకచర్ల ప్రాజెక్టు వివాదం, రాజీవ్ యువవికాసం పథకం అమలు ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు 18 సార్లు మంత్రివర్గ సమావేశాలు జరగ్గా 300కు పైగా అంశాలపై చర్చించారు.
Similar News
News July 10, 2025
తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

* రెండున్నర గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీ
* ఆగస్టు లోగా మెగా DSC పూర్తి చేస్తాం: లోకేశ్
* 20న నల్గొండ(D) దేవరకొండ పర్యటనకు CM రేవంత్
* Dy.CM పవన్ ఆదేశాలు.. విజయనగరం(D) దేవాడ మాంగనీస్ గనిలో అధికారుల తనిఖీలు
* కల్తీ కల్లు మృతుల కుటుంబాలకు రూ.20లక్షలివ్వాలి: KTR
* పుట్టపర్తి సత్యసాయి మహాసన్నిధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు
News July 10, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹220 పెరిగి ₹98,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹90,200 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 10, 2025
రెండు రోజులు వైన్స్ బంద్

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 13, 14 తేదీల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.