News September 8, 2024
DJ విషయంలో గొడవ.. ముగ్గురు మృతి

గణేశ్ మండపం వద్ద DJ విషయంలో యువకుల మధ్య ఏర్పడిన వాగ్వాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా నందిని PS పరిధిలో వినాయకచవితి ముందు రోజు మండపం వద్ద DJకు డాన్స్ చేస్తుండగా కొందరు యువకుల మధ్య వాగ్వాదం జరగ్గా, స్థానికుల జోక్యంతో ముగిసింది. తర్వాతి రోజు మండపం వద్ద ఇరువర్గాలు కర్రలు, మారణాయుధాలతో దాడి చేసుకోగా, ఓ వర్గానికి చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
Similar News
News January 1, 2026
ఈ ఏడాది పండుగల తేదీలివే..!

ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు జనవరి 13 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి. ఫిబ్రవరి 15న శివరాత్రి, మార్చి 4న హోలీ, 19న ఉగాదితో పాటు 19/20న రంజాన్ పండుగ ఉండనుంది. మార్చి 27న శ్రీరామనవమి, ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి రానున్నాయి. ఆగస్టు 28న రాఖీ, సెప్టెంబర్ 14న వినాయక చవితి, అక్టోబర్ 20న దసరా వేడుకలు జరగనున్నాయి. నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్తో ఏడాది ముగియనుంది. share it
News January 1, 2026
కొబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే..

కొబ్బరినూనెను జుట్టుకు రాయడం వల్ల జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. కొబ్బరినూనెను కాస్త వేడిచేసి అందులో కాస్త ఉసిరి పొడిని వేయాలి. ఆ మిశ్రమం చల్లారాక దాన్ని మీ జుట్టు, తల చర్మంపై పూర్తిగా పట్టేలా అప్లై చేయండి. అలా గంట పాటు ఉంచి మైల్డ్ షాంపూతో తలస్నానం చెయ్యాలి. దీని వల్ల స్కాల్ప్‌లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.
News January 1, 2026
డిసెంబర్ GST వసూళ్లు ₹1.75 లక్షల కోట్లు

డిసెంబర్ 2025లో భారత GST వసూళ్లు 6.1% వృద్ధి చెంది ₹1.75 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 19.7% పెరగడం దీనికి ప్రధాన కారణం. దేశీయంగా మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా వంటి రాష్ట్రాలు బలమైన వృద్ధిని కనబరచగా.. పంజాబ్, జమ్మూ కశ్మీర్లో తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం వసూళ్లు 8.6% పెరిగి ₹16.50 లక్షల కోట్లకు చేరడం భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని సూచిస్తోంది.


