News August 26, 2024
బంగ్లాలో మళ్లీ గొడవలు.. ఉద్రిక్తంగా పరిస్థితులు
బంగ్లాలో ఆదివారం రాత్రి మళ్లీ అల్లర్లు చెలరేగాయి. సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద వేలమంది విద్యార్థులు, అన్సార్ సభ్యులు ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైనికులు, పోలీసులు సౌండ్ గ్రెనేడ్లను ప్రయోగించినా గొడవలు ఆగలేదు. అన్సార్ సభ్యుల్లో కొందరు బయటకు వెళ్లిపోగా మరికొందరు చిక్కుకుపోయారు. కొత్త ప్రభుత్వం తమపై కుట్ర చేస్తోందన్న స్టూడెంట్స్ సెక్రటేరియట్‌ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
Similar News
News December 26, 2024
తుది శ్వాస వరకూ పోరాడతాం: ఖర్గే
గాంధీ-నెహ్రూల వారసత్వం తమకు ఉందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బెలగావి CWC సమావేశంలో మాట్లాడుతూ, ‘ఇక్కడి నుంచి మేం సంకల్పంతో తిరిగొస్తాం. ఐకమత్యంతో ప్రత్యర్థుల అబద్ధాల్ని తిప్పికొడతాం. ఎన్నికలు గెలిచే నైపుణ్యాన్ని పార్టీకి అందిస్తాం. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ పూర్తిగా అమలు చేస్తాం. గాంధీ-నెహ్రూ సిద్ధాంతాల కోసం, అంబేడ్కర్ గౌరవం కోసం తుదిశ్వాస వరకూ పోరాడుతాం’ అని తెలిపారు.
News December 26, 2024
CWC మీటింగ్‌లో మ్యాప్ వివాదం
బెళగావిలో CWC మీటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారత చిత్రపటంలో కశ్మీర్‌లోని కొన్ని భాగాలు లేకపోవడంపై వివాదం చెలరేగింది. దీనిపై వివరణ ఇవ్వాలని BJP డిమాండ్ చేసింది. జార్జ్ సొరోస్‌తో కలసి దేశాన్ని అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని విమర్శించింది. అయితే ఆ ఫ్లెక్సీని పార్టీ కాకుండా స్థానిక శ్రేణులు ఎవరో ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ వివరణ ఇచ్చింది.
News December 26, 2024
70 గంటలుగా బోరుబావిలో.. చిట్టి తల్లికి నరకం
రాజస్థాన్‌లోని కోఠ్‌పుత్లీ జిల్లాలో 3ఏళ్ల చిన్నారి 700 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. 70 గంటల క్రితం ఆమె పడిపోగా అప్పటి నుంచీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాట్ హోల్ మైనింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బాలిక ప్రస్తుతం 150 అడుగుల వద్ద ఉందన్నారు. పైపుతో ఆక్సిజన్ పంపిస్తున్నామని తెలిపారు. చిట్టితల్లి క్షేమంగా బయటపడాలని అందరూ ప్రార్థిస్తున్నారు.