News December 10, 2024
అన్నదమ్ముల మధ్య గొడవలు సహజం: మోహన్ బాబు

ఏ ఇంట్లోనైనా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని మంచు మోహన్ బాబు అన్నారు. తమ కుటుంబంలో చెలరేగిన వివాదంపై ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో జరుగుతున్న చిన్న తగాదా ఇది. దీనిని పరిష్కరించుకుంటాం. ఇళ్లలో గొడవలు జరిగితే అంతర్గతంగా పరిష్కరించుకుంటారు. గతంలో ఎన్నో కుటుంబాల గొడవలు పరిష్కరించా. వారు కలిసేలా చేశా’ అని తెలిపారు. జల్పల్లిలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News November 9, 2025
బుల్లెట్, థార్ బండ్లను అస్సలు వదలం: హరియాణా డీజీపీ

థార్ నడిపే వ్యక్తులు రోడ్లపై విన్యాసాలు చేస్తారని హరియాణా DGP ఓపీ సింగ్ అన్నారు. ‘మేం అన్ని వాహనాలను తనిఖీ చేయం. కానీ బుల్లెట్ బైక్, థార్ కార్లను అస్సలు వదలం. మీరు ఎంచుకునే వాహనాలే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. థార్ స్టేటస్ సింబల్ అయింది. ఇటీవల ఓ ACP కొడుకు థార్ నడిపి ఒకరిని ఢీకొట్టాడు. తన కుమారుడిని రక్షించాలని అధికారి వేడుకున్నాడు. కారు అతడి పేరు మీదే ఉంది. అతడొక మోసగాడు’ అని చెప్పారు.
News November 9, 2025
ఆముదం పంటలో దాసరి పురుగు నివారణ ఎలా?

దాసరి పురుగు ఆముదం పంటను జనవరి మాసం వరకు ఆశిస్తుంది. ఈ పురుగు పంటపై ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటకు తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.
News November 9, 2025
PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<


