News September 19, 2025
అమెరికాలో గొడవ.. పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

మహబూబ్‌నగర్ (TG)కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. MS చేసేందుకు 2016లో USకు వెళ్లిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ‘రూమ్‌మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని SEP 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరిపాం. గాయాలతో అతడు మరణించాడు’ అని పోలీసులు తెలిపారు.
Similar News
News February 22, 2026
పువ్వుల సాగు- మంచి ధర రావాలంటే మొక్కలు ఎప్పుడు నాటాలి?

పువ్వుల సాగులో లాభాలు రావాలంటే పంట నాటే సమయం కీలకం. దీని కోసం మార్చి, ఏప్రిల్ నెలల్లో మొక్కలను నాటుకోవడం మేలని.. హార్టికల్చర్ నిపుణులు, పువ్వుల సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతులు చెబుతున్నారు. ఇలా నాటితే జూన్ నుంచి పువ్వుల కాపు మొదలవుతుందని, జులై నుంచి ప్రారంభమయ్యే పండుగల నాటికి మంచి దిగుబడి వస్తుందని చెబుతున్నారు. అప్పుడు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తే మంచి లాభం పొందవచ్చంటున్నారు.
News February 22, 2026
భారీగా తగ్గిన క్యారెట్, బీట్‌రూట్ ధరలు

AP: రాష్ట్రంలో క్యారెట్, బీట్‌రూట్ ధరలు పడిపోయాయి. సాధారణంగా ఇవి కేజీకి రూ.80-100 చొప్పున విక్రయిస్తారు. అయితే రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటకలో క్యారెట్, బీట్‌రూట్ సాగు పెరగడంతో ధరలు దిగివచ్చాయి. దీంతో క్యారెట్, బీట్‌రూట్ కేజీకి రూ.30-40 చొప్పున లభ్యమవుతున్నాయి. అటు తెలంగాణలోనూ వీటి ధరలు కాస్త తగ్గి కేజీ రూ.50-70 మధ్య ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News February 22, 2026
కుండలు అమ్మే వ్యక్తికి ₹1.25 కోట్ల GST నోటీస్

రాయ్‌బరేలీ(UP)కి చెందిన సయీద్ అనే వ్యక్తి ₹2 విలువ చేసే చిన్న కుండలు అమ్ముతూ జీవిస్తున్నారు. ఆయనకు ఏకంగా ₹1.25 కోట్ల GST నోటీసు రావడం చూసి అవాక్కయ్యారు. ఆయన పేరిట 4 కంపెనీలు నడుస్తున్నట్లు వాటిలో ఉంది. గతంలో లోన్ కోసం ఆధార్, పాన్ కార్డులు ఇస్తే.. వాటిని ఎవరో కేటుగాళ్లు తప్పుడు వ్యాపారాలకు వాడినట్లు తెలుస్తోంది. కడు పేదరికంలో ఉన్న సయీద్.. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.


