News May 14, 2024

పల్నాడులో ఘర్షణలు.. రంగంలోకి ఎస్పీ!

image

AP: ఎన్నికల అనంతరం మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కారంపూడిలో ఘర్షణలు తలెత్తాయి. దీంతో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కాసేపట్లో మాచర్ల రానున్నట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలు కొనసాగే అవకాశం ఉండటంతో ఎస్పీ మాచర్లలోనే మకాం వేస్తారట. శాంతి భద్రతలు అదుపులోకి వచ్చే వరకు ఆయన అక్కడే ఉంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Similar News

News April 6, 2026

పెళ్లి చేసుకొన్న మహిళా క్రికెటర్లు

image

మహిళా క్రికెటర్లు అమీ జోన్స్(ఇంగ్లండ్), పైపా క్లియరీ(ఆస్ట్రేలియా) పెళ్లి చేసుకొన్నారు. ఈ నెల 4న తమ వివాహం జరిగినట్లు వారు ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 2024 జులైలో వారి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అమీ 8 టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20లు, క్లియరీ 109 టీ20లు ఆడారు. కాగా గతంలోనూ పలువురు ఉమెన్ క్రికెటర్లు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకొన్న విషయం తెలిసిందే.

News April 6, 2026

రేపు ఉ.11 గంటలకు అల్లు అర్జున్ మూవీ అప్డేట్

image

అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘AA22xA6’ మూవీ అప్డేట్‌ను రేపు ఉ.11 గంటలకు ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎల్లుండి ఐకాన్ స్టార్ బర్త్ డే ఉండగా ఒక రోజు ముందే అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనునున్నారు. టైటిల్ పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ ఉండొచ్చని సమాచారం.

News April 6, 2026

IPL: టాస్ గెలిచిన KKR

image

PBKSతో జరగనున్న మ్యాచులో KKR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచులో క్యాచ్ పడుతూ గాయపడిన వరుణ్ చక్రవర్తి ఆడట్లేదని కెప్టెన్ రహానే తెలిపారు. నరైన్ కూడా దూరమైనట్లు చెప్పారు.
KKR: అలెన్, రహానె, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకు, రమణ్ దీప్, అనుకుల్, సైనీ, వైభవ్, త్యాగి
PBKS: ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్, కూపర్, వధేరా, శశాంక్, స్టోయినిస్, యాన్సెన్, బార్ట్‌లెట్, వైశాఖ్, అర్ష్‌దీప్, చాహల్