News July 29, 2024

₹ లక్షల్లో ఫీజులు తీసుకొని సెల్లార్లో క్లాసులా?

image

UPSCలో మంచి ర్యాంక్ సాధించాలంటే ఢిల్లీలో కోచింగ్ తీసుకోవాల్సిందే అని చెప్తుంటారు. ఇదే అదనుగా తీసుకొని అక్కడి కోచింగ్ సెంటర్లు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. జనరల్ స్టడీస్ 10 నెలల కోచింగ్ కోసం రూ.1.75 లక్షలు, ఆప్షనల్ సబ్జెక్ట్ కోసం రూ.55వేలు ఫీజు తీసుకుంటున్నారు. కానీ, ప్రమాదకరంగా సెల్లార్‌లో క్లాసులు చెప్తున్నారు. అయితే ప్రాణాలు <<13723684>>పోయేవరకూ<<>> దీనిపై అధికారులు దృష్టి పెట్టకపోవడం గమనార్హం.

Similar News

News December 3, 2025

చౌడు నేలల్లో యూరియాను ఎలా వేస్తే మంచిది?

image

నేలలో ఉదజని సూచిక 7 కంటే ఎక్కువ ఉంటే ఆ నేలలను చౌడు నేలలుగా పరిగణిస్తారు. ఈ మట్టిలోని లవణాల శాతం ఎక్కువుగా ఉంటే భూసారం తగ్గి, మొక్కకు అవసరమైన పోషకాలు అందవు. అయితే ఈ చౌడు నేలల్లో పండించే పంటలకు యూరియాను తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయడంతో పాటు యూరియాను పిచికారీ చేయాలి. నానో యూరియా వంటి ఎరువులను వాడటం వల్ల పంటల్లో మంచి దిగుబడి సాధించవచ్చంటున్నారు నిపుణులు.

News December 3, 2025

ఈ పేరున్న వారికి అదృష్టం వరించింది!

image

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల ఈ-డిప్‌లో మొత్తం 1.76 లక్షల మందికి అవకాశం లభించింది. టోకెన్లు పొందిన భక్తుల లిస్టు రిలీజ్ చేయగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది. ఇందులో వెంకట్& వెంకటేశ్ & శ్రీనివాస్ అనే పేర్లున్న వారే 12,099 మంది ఉన్నారు. అలాగే 10,474 మంది లక్ష్మీ, పద్మావతి &పద్మ అనే పేర్లున్నవారు ఉండటం విశేషం. తిరుమలేశుడి పేరున్నా తమకు అవకాశం రాలేదని మరికొందరు నిరాశ చెందుతున్నారు.

News December 3, 2025

టాటా ట్రస్ట్ ఎలక్షన్ ఫండ్స్.. 83 శాతం బీజేపీకే

image

2024-25 లోక్‌సభ ఎలక్షన్ ఇయర్‌లో టాటా గ్రూప్‌ అనుబంధ ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి BJPకి రూ.757 కోట్ల ఫండ్స్ అందాయి. ట్రస్ట్ అందించిన మొత్తం నిధుల్లో ఇది 83% కాగా 8.4% వాటాతో కాంగ్రెస్‌ రూ.77.3 కోట్లు అందుకుంది. ఈసీకి అందించిన వివరాల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల సమయంలో BJP, కాంగ్రెస్ సహా 10 రాజకీయ పార్టీలకు రూ.914 కోట్ల నిధులొచ్చాయి. YCP, BRS తదితర పార్టీలకు చెరో రూ.10 కోట్లు ఇచ్చింది.