News October 4, 2024

మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్

image

దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. మరాఠీ, బెంగాలీ, పాళీ, ప్రాకృత, అస్సామీ భాషలకు ఈ స్థాయిని కల్పించనుంది. దీంతో వీటితో కలిపి దేశంలోని సాంప్రదాయ భాషల సంఖ్య 11కు చేరనుంది. ఇప్పటివరకు తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలు మాత్రమే ఈ స్టేటస్‌ను కలిగి ఉన్నాయి.

Similar News

News December 11, 2025

ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు 24వ ర్యాంకు.!

image

ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు ఇటీవల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆయన 388 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 356 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను కేవలం 9 రోజుల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనకు CM చంద్రబాబు రాష్ట్రంలో 24వ ర్యాంకు కేటాయించారు.

News December 11, 2025

రాష్ట్రంలో 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

<>ఏపీ <<>>మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ 26 జిల్లాల్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డులో ఖాళీగా ఉన్న 182 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, చైల్డ్ సైకాలజీ, సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్స్, ఎడ్యుకేషన్, LLB ఉత్తీర్ణతతో పాటు సంక్షేమ కార్యక్రమాల్లో పని అనుభవం గల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://wdcw.ap.gov.in/

News December 11, 2025

ఆలయ ప్రవేశం.. ఆరోగ్య కారకం!

image

గుడికి వెళ్లినప్పుడు చెప్పులను బయటే వదిలేస్తాం. దీనివల్ల ప్రతికూల శక్తి ఆలయంలోకి ప్రవేశించదు. దేవాలయ ప్రాంగణంలో ఒట్టి కాళ్లతో నడవడం వల్ల నేలలోని పాజిటివ్ ఎనర్జీ పాదాల ద్వారా శరీరమంతా వ్యాపించి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే దేవతా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి అందులో కూడా శక్తిమంతమైన అయస్కాంత శక్తి నిలుస్తుంది. దైవ దర్శనంతో ఆ శక్తి మనలోకి ప్రవేశించి, నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది.