News August 10, 2024

వెంటనే వర్గీకరణ చేపట్టాలి: మందకృష్ణ

image

SC రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ తనకు నిర్దిష్టమైన హామీ ఇచ్చారని MRPS వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు. ఢిల్లీలో నిన్న ఆయన ప్రధానిని కలిశారు. ‘వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్‌షా పాత్ర కీలకం. డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో వెంటనే వర్గీకరణ అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేలా చూడాలని మోదీని కోరా’ అని ఇవాళ ఆయన వెల్లడించారు.

Similar News

News November 21, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడంటే!

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. అత్యల్పంగా నస్రుల్లాబాద్ 10.9°C, బొమ్మన్ దేవిపల్లి, డోంగ్లి 11, మేనూర్ 11.1, లచ్చపేట 11.2, బీబీపేట 11.3, బీర్కూర్, జుక్కల్ 11.4, గాంధారి 11.7, బిచ్కుంద 11.8, ఎల్పుగొండ 11.9, రామారెడ్డి, పుల్కల్ 12, రామలక్ష్మణపల్లి 12.1, సర్వాపూర్, ఇసాయిపేట 12.2, నాగిరెడ్డిపేట, మాక్దూంపూర్ 12.7, కొల్లూరు 12.9లుగా నమోదయ్యాయి.

News November 21, 2025

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు US పీస్ ప్లాన్!

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు US ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి US 28 పాయింట్లతో కూడిన పీస్ ప్లాన్‌ను అందజేసింది. ఉక్రెయిన్ తన తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని వదులుకోవడం, సాయుధ దళాల పరిమాణాన్ని తగ్గించుకోవడం వంటివి అందులో ఉన్నట్లు సమాచారం. తన ప్రమేయం లేకుండా రూపొందించిన ఈ ప్లాన్‌పై జెలెన్ స్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ట్రంప్‌తో చర్చించే ఛాన్సుంది.

News November 21, 2025

పత్తి, వేరుశనగలో ఈ ఎర పంటలతో లాభం

image

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ వేరుశనగలో పొగాకు లద్దెపురుగు నివారణకు ఆముదం లేదా పొద్దుతిరుగుడు పంటను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 100 మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి.