News August 5, 2024
నేటి నుంచి ‘స్వచ్ఛదనం-పచ్చదనం’

TG: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పాటు ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమం జరగనుంది. అబ్బాపురంలో మంత్రి సీతక్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ‘నా గ్రామం నా గౌరవం’ నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో జరిగే పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యక్రమాలు, వనమహోత్సవంలో ప్రజలు పాలుపంచుకోవాలని మంత్రి సీతక్క కోరారు. పల్లెలు బాగుంటేనే, తెలంగాణ బాగుంటుందని చెప్పారు.
Similar News
News January 11, 2026
కాంగ్రెస్తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

ఈ సారి తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకోనున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. హస్తం పార్టీ సీట్ల షేరింగ్ ప్రపోజల్ను స్టాలిన్ తిరస్కరించినట్లు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం ఉండబోదన్న DMK నేత, మంత్రి పెరియస్వామి మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. మరోవైపు హీరో విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
News January 11, 2026
మైలురాళ్ల రంగుల గురించి తెలుసా?

*పసుపు: నేషనల్ హైవేలను సూచిస్తుంది. రాష్ట్రాలు, ప్రధాన నగరాలను కలిపే ఈ రోడ్లను NHAI మెయింటెన్ చేస్తుంది.
*గ్రీన్: ఇది స్టేట్ హైవేను సూచిస్తుంది. ఒక రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలను కనెక్ట్ చేస్తుంది.
*బ్లాక్: సిటీ, జిల్లా రోడ్లను సూచిస్తుంది. అర్బన్ సెంటర్లు, మున్సిపాలిటీలను కలుపుతుంది.
*ఆరెంజ్: గ్రామాల రోడ్లను సూచిస్తుంది. PMGSY స్కీమ్ ద్వారా వీటిని అభివృద్ధి చేస్తారు.
News January 11, 2026
ట్రంప్ టారిఫ్స్.. TNలో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. MSMEలు మూతబడేలా ఉన్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు చెప్పారు. వస్త్ర రంగం కోసం ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.


