News June 1, 2024
TDPకి క్లియర్ మెజార్టీ: Prism, Rise
APలో TDPకి 92-99 సీట్లు వస్తాయని Rise సర్వే అంచనా వేస్తోంది. కూటమిలోని మిగతా పార్టీలైన జనసేన: 11-16, బీజేపీ: 0-3 స్థానాల్లో గెలుస్తాయని ఎగ్జిట్ పోల్ రిపోర్టులో పేర్కొంది. మరోవైపు టీడీపీ: 110 (+/-5) సెగ్మెంట్లు సొంతం చేసుకుంటుందని Prism ఎగ్జిట్ పోల్ చెబుతోంది. JSP: 14 (+/-1), BJP: 2(+/-1) చోట్ల గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది. YCP 60 (+/-5) నియోజకవర్గాలకే పరిమితం కాబోతుందని వివరాలు వెల్లడించింది.
Similar News
News January 23, 2025
ఇండియా బ్రాండ్‌దే కీలకమైన స్థానం: చంద్రబాబు
CMలుగా వేర్వేరు పార్టీలకు చెందినా ప్రజల కోసం ఐక్యంగా ఆలోచిస్తామని AP CM <<15229916>>చంద్రబాబు<<>> అన్నారు. ‘కలిసి పనిచేస్తే వికసిత భారత్ సాధ్యమే. వ్యవసాయం, మానవాభివృద్ధిలో డీప్ టెక్ లాంటి సాంకేతికత రావాలి. ప్రస్తుతం ఇండియా బ్రాండ్‌దే కీలకమైన స్థానం. పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధిరేటులో AP కృషి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 165గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తున్నాం’ అని దావోస్‌లో చంద్రబాబు తెలిపారు.
News January 23, 2025
జనవరి 23: చరిత్రలో ఈరోజు
1897: స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జననం
1911: హైదరాబాద్ తొలి మహిళా మేయర్ రాణీ కుముదినీ దేవి జననం
1915: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థర్ లూయీస్ జననం
1926: శివసేన పార్టీ వ్యవస్థాపకుడైన బాల్ ఠాక్రే జననం
2015: హాస్యనటుడు ఎం.ఎస్. నారాయణ మరణం
News January 23, 2025
ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్‌స్టాపబుల్: చంద్రబాబు
దావోస్‌లో పెట్టుబడులకు పోటీ పడుతున్నా అందరిదీ టీంఇండియాగా ఒకే లక్ష్యం అని AP CM చంద్రబాబు అన్నారు. ‘భారత్ నుంచి దావోస్‌కు హాజరవుతున్న వారిలో నేనే సీనియర్. 1997 నుంచి వస్తున్నాను. గతంలో భారత్‌కు గుర్తింపు తక్కువగా ఉండేది. ఇప్పుడు గొప్ప గుర్తింపు వచ్చింది. 2028నాటికి భారత్‌లో ఇంక్రిమెంటల్ గ్రోత్ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్‌స్టాపబుల్’ అని దేశం తరఫున నిర్వహించిన ప్రెస్మీట్లో CBN చెప్పారు.