News September 12, 2025

MOSతో క్లరికల్ ఉద్యోగాలు

image

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో క్లరికల్ కేడర్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడే కోర్సు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్(MOS). దీని ద్వారా వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తదితర బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ లభిస్తాయి. దీంతో SSC నిర్వహించే CHSL, MTS రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో విజయం సాధించవచ్చు. పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందిస్తున్నాయి.

Similar News

News April 10, 2026

ఇరాన్‌ కొత్త నాయకత్వం ఇంకా డేంజర్: IDF

image

ఇరాన్‌లో ఇప్పుడున్న నాయకత్వం మరింత ఎక్స్‌ట్రీమ్‌గా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) హెచ్చరించింది. ఖమేనీ చనిపోయిన తర్వాత ఏర్పడిన కొత్త లీడర్‌షిప్ సంప్రదాయ మత పెద్దల నుంచి కాకుండా IRGC నుంచి వచ్చిందని తెలిపింది. ఈ మేరకు రహస్య సమావేశంలో IDF ప్రతినిధులు పార్లమెంటు ఫారిన్ అఫైర్స్ కమిటీకి తెలియజేశారు. ఈ క్రమంలో యుద్ధం తిరిగి ప్రారంభం కావచ్చని కమిటీ చీఫ్ బోవజ్ బిస్ముత్ అభిప్రాయపడ్డారు.

News April 10, 2026

IPL: రాత్రి 8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం

image

IPL అభిమానులకు గుడ్‌న్యూస్. RCB-RR మ్యాచ్ జరగాల్సిన గువాహటి స్టేడియం వద్ద వర్షం తగ్గింది. సిబ్బంది కవర్లు తొలగించారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అంపైర్లు రా.8 గంటలకు టాస్ వేయనున్నారు. రా.8.15 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పూర్తి ఓవర్ల గేమ్ జరగనుంది.

News April 10, 2026

మెలానియా ప్రకటన.. టైమింగ్ వెనక పెద్ద ప్లాన్?

image

మెలానియా సడన్‌గా ఎప్‌స్టీన్ గురించి <<19611865>>మాట్లాడటం<<>> వెనక అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ఎక్కడా ట్రంప్‌ను సమర్థించకపోవడంతో విడాకుల రూమర్లు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ విఫలమవుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్లాన్ చేశారనే వాదనలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఎప్‌స్టీన్ రహస్య ఈమెయిల్స్ ద్వారా ఏదైనా పెద్ద విషయం బయటకొస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.