News September 27, 2024

గుండె ఆరోగ్యం కోసం నిత్యం 30 మెట్లు ఎక్కండి!

image

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. అందుకే ఒకవేళ మీరు 30ఏళ్ల వయసువారైతే ప్రతి రోజూ 30మెట్లు ఎక్కి గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 30మెట్లు అంటే దాదాపు రెండు అంతస్తులకు సమానమని, ఇది గుండెను ఉత్తేజపరిచే వ్యాయామంగా పని చేస్తుందని చెబుతున్నారు. సో, మీ ఆఫీస్, అపార్టుమెంట్లలో లిఫ్ట్ ఉంటే దానికి టాటా చెప్పండి. మెట్లు ఎక్కడం దినచర్యగా చేసుకోండి.

Similar News

News November 17, 2025

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం.. నేడు ఏం జరగనుంది?

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. స్పీకర్‌పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌తో పాటు 10 మంది MLAలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను ధర్మాసనం నేడు విచారించనుంది. MLAలను విచారించేందుకు స్పీకర్‌కు మరింత సమయం ఇస్తారా? లేదా తుది నిర్ణయం తీసుకుంటారా? ఈ నెల 23న సీజేఐ గవాయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో విచారణను మరో బెంచ్‌కు పంపిస్తారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.

News November 17, 2025

గంభీర్ వల్లే ఓడిపోయాం.. నెటిజన్ల ఫైర్

image

నిన్న సౌతాఫ్రికా చేతిలో టీమ్ ఇండియా ఓటమికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పులే కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే ఎందుకు మార్పులు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్పెషలిస్టు బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఆడించకుండా నలుగురు స్పిన్నర్లు ఎందుకని నిలదీస్తున్నారు. గతేడాది NZతో వైట్‌వాష్ అయినా పాఠాలు నేర్వకుండా మళ్లీ స్పిన్ పిచ్‌లే ఎందుకు తయారుచేశారని ప్రశ్నిస్తున్నారు.

News November 17, 2025

ఒకేసారి రెండు సీక్వెల్స్‌లో తేజా సజ్జ!

image

హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజా సజ్జ మరో 2 చిత్రాలను లైన్‌లో పెట్టారు. జాంబిరెడ్డి, మిరాయ్ మూవీల సీక్వెల్స్‌ను సమాంతరంగా పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుల ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు సమాచారం. జనవరిలో జాంబిరెడ్డి-2, మార్చిలో మిరాయ్-2ను సెట్స్‌పైకి తీసుకెళ్తారని టాక్. ఈ సినిమాలను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది.