News May 22, 2024
ఆక్సిజన్ సాయం లేకుండా ఎవరెస్ట్ ఎక్కాడు

పాకిస్థాన్కు చెందిన పర్వతారోహకుడు సిర్బాజ్ ఖాన్ ఆక్సిజన్ సాయం లేకుండా ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ను అధిరోహించారు. ఇలా ఎవరెస్టును ఎక్కిన రెండో పాకిస్థానీగా నిలిచారు. ఈ మౌంటెన్ను అధిరోహించడం ఇతనికిది రెండోసారి కాగా.. మొదటిసారి ఆక్సిజన్ సిలిండర్ సాయంతో ఎక్కారు. 8,848 మీటర్ల ఎత్తున్న 11 శిఖరాలను ఆక్సిజన్ సాయం లేకుండా అధిరోహించడం విశేషం.
Similar News
News November 14, 2025
చిన్నారులు, టీనేజర్లకు బీపీ.. 20 ఏళ్లలో డబుల్

అధిక రక్తపోటుతో బాధపడుతున్న చిన్నారులు, టీనేజర్ల సంఖ్య 20 ఏళ్లలో డబుల్ అయినట్టు వెల్లడైంది. 2000లో 3.2% ఉండగా 2020కి 6% పెరిగిందని తేలింది. 21 దేశాలకు చెందిన 4,43,000 మంది చిన్నారుల హెల్త్ రిపోర్టులను పరిశీలించినట్టు జర్నల్ ప్రచురించింది. ‘బీపీకి చికిత్స చేయించకపోతే భవిష్యత్తులో గుండె, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒబెసిటీ ఉన్న ఐదుగురు చిన్నారుల్లో ఒకరు బీపీతో బాధపడుతున్నారు’ అని పేర్కొంది.
News November 14, 2025
ఉసిరిలో తుప్పు తెగులు – నివారణ ఎలా?

ఉసిరిలో తుప్పు తెగులు సోకిన చెట్ల ఆకులపై తొలుత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత ఇవి తుప్పు రంగుకు మారతాయి. వాటిని మనం చేతితో ముట్టుకుంటే ఆ రంగు మన చేతికి అంటుకున్నట్లుగా అనిపిస్తుంది. ఈ తెగులు రావడం వల్ల కాయలు పక్వదశకు చేరే కంటే ముందే రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 1ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి చెట్టుపై పిచికారీ చేయాలి.
News November 14, 2025
డబ్బుల పంపిణీతోనే ‘జూబ్లీ’లో కాంగ్రెస్ గెలుపు: కిషన్రెడ్డి

TG: దేశ ప్రజలు కాంగ్రెస్కు మంగళం పాడేశారని బిహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. SIRను వ్యతిరేకిస్తున్న రాహుల్ వాదనను ప్రజలు తోసిపుచ్చారన్నారు. ECIకి ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్లో తామెన్నడూ గెలవలేదని, ఉపఎన్నికలో కాంగ్రెస్ డబ్బులతో గెలిచిందని విమర్శించారు. EVMలపై ఆరోపణలు చేస్తున్న రాహుల్ ‘జూబ్లీ’ గెలుపుపై సమాధానం చెప్పాలన్నారు.


