News February 6, 2025
సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ భేటీ

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఎంసీహెచ్ఆర్డీలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, దుష్ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు ఇతర అంశాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News March 7, 2026
రేపు కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

INDT20 జట్టు కెప్టెన్ సూర్య రేపు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. కివీస్‌తో జరిగే T20WC ఫైనల్‌లో గెలుపోటములతో సంబంధం లేకుండా అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఫామ్ తగ్గడం, వయసు పెరగడం(35 ఏళ్లు), కెరీర్ చివరి దశలో ఉన్నందున రిటైర్మెంట్‌కు ఇదే మంచి తరుణమని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా SKY కెప్టెన్సీలో IND ఒక్క సిరీసూ ఓడిపోలేదు. అయితే బ్యాటర్‌గా విఫలమవుతున్నారు.
News March 7, 2026
8 మంది MLAలకు క్లీన్ చిట్

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పును ఆయన రిజర్వ్ చేశారు.
News March 7, 2026
దేశంలోనే అతిపెద్ద లొంగుబాటు: రేవంత్

TG: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద మావోయిస్టు <<19321592>>లొంగుబాటు<<>> అని CM రేవంత్ అన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మిగతావాళ్లంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. గణపతి రక్షణ, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోలకు ఆరోగ్య, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామన్నారు. మావోలు లేవనెత్తిన రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.


