News February 6, 2025

ఇవాళ CLP సమావేశం.. కీలక అంశాలపై చర్చ

image

TG: కాంగ్రెస్ శాసనసభాపక్షం(CLP) ఇవాళ సమావేశం కానుంది. HYDలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో CM రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. MLC ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశమూ ప్రస్తావనకు రావొచ్చని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు.

Similar News

News February 6, 2025

మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

image

TG: రైతు భరోసా పథకం కింద జనవరి 27 నుంచి ఇప్పటి వరకు 21,45,330 మందికి ₹1,126Cr జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న ఒక్కరోజే ఎకరం లోపు సాగు చేస్తున్న 17.03లక్షల మందికి ₹6K చొప్పున లబ్ధి చేకూర్చినట్లు తెలిపింది. త్వరలోనే 2, 3 ఎకరాల రైతులకు నిధులు జమ చేస్తామంది. కాగా MLC ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్‌గోయింగ్ స్కీమ్ కింద ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. మరి మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయా?

News February 6, 2025

భారీగా ధర పతనం.. మిర్చి రైతుల కుదేలు

image

AP: అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చికి డిమాండ్ తగ్గడంతో రేటు భారీగా పతనమైంది. గత ఏడాది క్వింటా ₹35K పలికిన ధర ఇప్పుడు రకాన్ని బట్టి ₹10K-₹17K లోపే ఉంటోంది. రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి. విత్తనం, పురుగుమందుల రేట్లు పెరగడం, కూలీల డిమాండ్ కారణంగా ఎకరాకు ₹3L ఖర్చవుతుంటే దిగుబడి 20-22 క్వింటాళ్లే వస్తోంది. దీంతో రైతులు కుదేలవుతున్నారు. ధర విషయంలో ప్రభుత్వం కలగజేసుకోవాలని కోరుతున్నారు.

News February 6, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయన వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్ఠానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైనా ఆయన చర్చించవచ్చని సమాచారం.

error: Content is protected !!